Raju Yadav OTT: ఎంజాయ్ పండగో.. ఓటీటీలోకి వచ్చేసిన గెటప్ శీను ‘రాజు యాదవ్’.. ఎందులో చూడొచ్చంటే?

స్టార్ కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను హీరోగా మారి నటించిన మొదటి చిత్రం రాజు యాదవ్. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు ముందే గెటప్ శీను సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టుగానే మే 24న థియేటర్లలో రిలీజైన గెటప్ శీను సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Raju Yadav OTT: ఎంజాయ్ పండగో.. ఓటీటీలోకి వచ్చేసిన గెటప్ శీను 'రాజు యాదవ్'.. ఎందులో చూడొచ్చంటే?
Raju Yadav Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2024 | 7:26 PM

స్టార్ కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను హీరోగా మారి నటించిన మొదటి చిత్రం రాజు యాదవ్. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు ముందే గెటప్ శీను సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టుగానే మే 24న థియేటర్లలో రిలీజైన గెటప్ శీను సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరోగా గెటప్ శీను నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు, రివ్యూలు వచ్చాయి. అయితే కథా, కథనంలోని లోపాలుండడంతో రాజు యాదవ్ సినిమా లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. దీంతో చాలామంది ఆడియెన్స్ ఓటీటీలోనే ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు రాజు యాదవ్. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి తగ్గట్టుగానే బుధవారం (జులై 24) నుంచి రాజు యాదవ్ సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంది ఆహా.

‘మన రాజు యాదవ్ ప్రేమ కథ చూస్తారా? అతని నవ్వు వెనక స్టోరీ చూస్తారా? గెటప్ శీను హీరోగా నటించిన క్రేజీ ఎంటర టైనర్ రాజు యాదవ్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది’ అంటూ ఒక పోస్టర్ ను పంచుకుంది ఆహా. వరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో నంద చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత్, సంతోష్ రాజ్, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ రాజు యాదవ్ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో రాజు యాదవ్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న రాజు యాదవ్..

రాజు యాదవ్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!