Shakhahaari OTT: ఓటీటీలో మతిపోగోట్టే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.. తెలుగులోనూ IMDB టాప్ రేటింగ్ సినిమా

సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఒక్కోసారి థియేటర్లలో ఈ సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చు కానీ ఓటీటీలో మాత్రం మస్త్ వ్యూస్ వస్తుంటాయి. అందుకే ఇతర భాషల్లో హిట్ అయిన సస్పెన్స థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. అలా ఒక కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Shakhahaari OTT:  ఓటీటీలో మతిపోగోట్టే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.. తెలుగులోనూ IMDB టాప్ రేటింగ్ సినిమా
Shakhahaari Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2024 | 6:28 PM

సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఒక్కోసారి థియేటర్లలో ఈ సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చు కానీ ఓటీటీలో మాత్రం మస్త్ వ్యూస్ వస్తుంటాయి. అందుకే ఇతర భాషల్లో హిట్ అయిన సస్పెన్స థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. అలా ఒక కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నడలో రిలీజైన సినిమా ‘శాఖాహారి’. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు అక్కడి జనాలు ఫిదా అయ్యారు. ఆద్యంతం ఆసక్తికరమైన సీన్లు, బుర్ర తిరిగిపోయే ట్విస్టులు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన శాకాహారి మూవీ కోట్లాది రూపాయల వసూళ్లను సాధించింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ రెండు నెలల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే అప్పుడు కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. బుధవారం (జులై 24) నుంచి శాకాహారి మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

సందీప్ సుంకద్ దర్శకత్వం వహించిన శాకాహారి సినిమాలో హోటల్‌లో వంట చేసే సుబ్బన్న గా ప్రముఖ నటుడు రంగాయణ రఘు కనిపిస్తారు. గోపాల్‌కృష్ణ దేశ్‌పాండే పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమాలో సుజయ్ శాస్త్రి కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ప్రతిమా నాయక్, హరిణి, వినయ్ యూజే, శ్రీహర్ష గోభట్టా, నిధి హెగ్డే తదితరులు ఈ సినిమాలో నటించారు. అలాగే ఈ సినిమాకు విశ్వజిత్ రావు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, శశాంక్ నారాయణ్ సంగీతం అందించారు. తీర్థహళ్లి అనే కొండ పట్టణంలో జరిగే కొన్ని రహస్య సంఘటనల చుట్టూ శాకాహారి సినిమా కథ తిరుగుతుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి శాకాహారి సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!