Operation Raavan: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. 1000 సిల్వర్ కాయిన్స్ గెల్చుకునే అవకాశం.. సినిమా చూసి..

పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆపరేషన్ రావణ్'. హీరో రక్షిత్ తండ్రి వెంకట్ సత్య స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సంగీర్తన విపిన్‌ కథానాయికగా కనిపించనుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఆపరేషన్ రావణ సినిమా ఈ నెల 26న తెలుగు తో పాటు తమిళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Operation Raavan: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. 1000 సిల్వర్ కాయిన్స్ గెల్చుకునే అవకాశం.. సినిమా చూసి..
Operation Raavan Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2024 | 8:33 PM

పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆపరేషన్ రావణ్’. హీరో రక్షిత్ తండ్రి వెంకట్ సత్య స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సంగీర్తన విపిన్‌ కథానాయికగా కనిపించనుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఆపరేషన్ రావణ సినిమా ఈ నెల 26న తెలుగు తో పాటు తమిళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తమ సినిమా చూడాలనుకుంటున్న ఆడియెన్స్ కోసం ఒక చిన్న కంటెస్ట్ పెట్టారు. ఇందులో గెలిస్తే వెండి నాణెల్ని బహుమతిగా ఇస్తామని వెల్లడించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మందికి ఈ వెండి కాయిన్లను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఏం చేయాలనేది కూడా మేకర్స్ చెప్పుకొచ్చారు. కాగా ఆపరేషన్ రావణ్ సినిమాలో మాస్క్ మ్యాన్ సైకో క్యారెక్టర్ కీలకంగా ఉండనుందట. సినిమా ప్రారంభమైన గంటలోపు (అంటే దాదాపు ఫస్టాప్) ఆ సైకో పాత్రధారి ఎవరనేది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది.

‘ఆపరేషన్ రావణ్’ సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌ లో నుంచి తమ ఫొటో, టికెట్, సైకో పాత్రధారి ఎవరు? అనే సమాధానాన్ని 9573812831 నంబర్‌కు వాట్సాప్ చేయాలి. ఇలా పంపిన వారిలో వెయ్యి మంది ప్రేక్షకులకు ఒక్కొక్కరికి ఒక్కో సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ..’ మా సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్‌లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్‌కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ అందజేస్తాను. ఇందుకోసం ఇప్పటికే వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాం కూడా’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!