AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: మరోసారి ఆ ఇద్దరితో సమంత.. ఈసారి నెక్స్ట్ లెవల్ ప్లాన్ చేస్తున్నారుగా..

విడాకుల తర్వాత సమంత సినిమాలను ఎంచుకునే పద్ధతి పూర్తిగా మారిపోయింది. సమంత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. విడాకులకు ముందు రాజ్, డికెల సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో సమంతా నటించింది. ఈ సిరీస్ లో సామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. తమిళ నక్సలైట్‌గా బోల్డ్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Samantha Ruth Prabhu: మరోసారి ఆ ఇద్దరితో సమంత.. ఈసారి నెక్స్ట్ లెవల్ ప్లాన్ చేస్తున్నారుగా..
Samantha
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2024 | 8:17 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటుంది. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ చిన్నది. దాదాపు టాప్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ఆకట్టుకుంది. విడాకుల తర్వాత సమంత సినిమాలను ఎంచుకునే పద్ధతి పూర్తిగా మారిపోయింది. సమంత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. విడాకులకు ముందు రాజ్, డికెల సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’లో సమంతా నటించింది. ఈ సిరీస్ లో సామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. తమిళ నక్సలైట్‌గా బోల్డ్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి సమంత రాజ్, డికెలతో సిరీస్ చేయనుందని తెలుస్తోంది. ఈసారి వింత పాత్రలో కనిపించబోతోందని టాక్.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ రాజ్, డికె ద్వయం రచన , దర్శకత్వం వహించారు. ఇప్పుడు అదే రాజ్, డికె ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు, ఇందులో సమంత ప్రధాన పాత్రను పోషిస్తుంది. విశేషమేమిటంటే, కల్ట్ క్లాసిక్ మరాఠీ మూవీ ‘తుంబాడ్’కి దర్శకత్వం వహించిన రాహి అనిల్ బరావే కూడా దర్శకత్వ బృందం చేరారు.  ‘రక్త్ బ్రహ్మాండ్’ పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలుస్తోంది.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

ఈ వెబ్ సిరీస్ కథ స్వతంత్ర భారతదేశానికి పూర్వం ఒక గ్రామంలో జరిగే కథఅని తెలుస్తోంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లోని ఆరు ఎపిసోడ్‌లను మొదట విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం నుంచే షూటింగ్ మొదలు కానుంది. చాలా వరకు షూటింగ్ సెట్స్‌ లోనే చేయనున్నారు. త్వరగా వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఇది మల్టీ స్టారర్ వెబ్ సిరీస్, సమంతతో పాటు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ గుడ్డూభాయ్ ఫేమ్ అలీ ఫజల్, బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్, తెలుగు, తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన వామిక కూడా నటించనున్నారు. సమంత గత ఏడాది కాలంగా షూటింగ్‌కి విరామం ఇచ్చింది. ఇప్పుడు సమంత మళ్లీ సినిమాల్లోకి రానుంది. తెలుగులో ‘నా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ‘రక్త్ బ్రహ్మాండం’ అనే థ్రిల్లర్ సిరీస్‌ చేస్తుంది. అలాగే సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన ‘సిటాడెల్’ చిత్రం షూటింగ్‌ పూర్తయి ఇంకా విడుదల కాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జీతం ఎలా ఖర్చు పెట్టాలి? బెస్ట్ ఫార్ములా ఇదే..
జీతం ఎలా ఖర్చు పెట్టాలి? బెస్ట్ ఫార్ములా ఇదే..