Venu Madhav: ఇదేందయ్యా ఇది..! కేజీఎఫ్ సినిమా కథను వేణుమాధవ్ ముందే చెప్పారా..!!

మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణుమాధవ్ ఆతర్వాత మెల్లగా సినిమాల్లోకి అడుగు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు.  వేణు మాధవ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది.

Venu Madhav: ఇదేందయ్యా ఇది..! కేజీఎఫ్ సినిమా కథను వేణుమాధవ్ ముందే చెప్పారా..!!
Venumadhav
Follow us

|

Updated on: Jul 24, 2024 | 8:42 PM

టాలీవుడ్ లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దివంగత నటుడు వేణుమాధవ్. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వేణుమాధవ్. మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణుమాధవ్ ఆతర్వాత మెల్లగా సినిమాల్లోకి అడుగు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు.  వేణు మాధవ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. 2006 లో లక్ష్మి సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. కాగా వేణు మాధవ్ 2019లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. లేకుంటే ఆయన ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉండేవారు.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

ఇక వేణుమాధవ్ ఈ లోకాన్ని విడిచి ఇన్నేళ్లు అవుతున్నా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా కేజీఎఫ్ సినిమా కథను ముందే వేణుమాధవ్ చెప్పారు. అవును.. వేణు మాధవ్ కామెడీగా చెప్పిన కథే ప్రశాంత్ నీల్ సీరియస్ గా తీసుకొని సినిమా చేసి బ్లక్ బస్టర్ హిట్ కొట్టారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా నేనింతే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న చాలా మందికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో వేణుమాధవ్ తన కామెడీతో నవ్వులు పూయించారు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఈ సినిమాలో  దర్శకుడిని అంటూ నటుడు సుబ్బరాజ్ దగ్గరకు వెళ్లి వేణుమాధవ్ ఓ కథ చెప్తాడు. కన్నులెంది ఒరూ జూమ్‌ బ్యాక్‌ వంద ఫస్ట్‌ షాట్‌.. ” అంటూ తెలుగు, తమిళ్ భాషలను మిక్స్ చేసి ఓ స్టోరీ చెప్తారు వేణు మాధవ్. ఆయన చెప్పిన కథను సరిగ్గా వింటే అదే కథ కేజీఎఫ్ సినిమాలో ఉంటుంది. వేణుమాధవ్ ఫన్నీగా చెప్పిన ఆ కథనే ప్రశాంత్ నీల్ సీరియస్ గా తీసుకొని సినిమా చేశాడు అంటూ కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.