Rajeev Rayala |
Updated on: Jul 24, 2024 | 9:25 PM
ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అందాల భామ మమిత బైజు. డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేరళతోపాటు తమిళనాడులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది.
దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్ తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన మమిత కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు.
మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన మమిత ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. చేసింది ఒక్క సినిమానే అయినా అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది.
ప్రేమలు సినిమా తర్వాత ఈ అమ్మడు ఏ సినిమాలో నటిస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మమిత తెలుగు సినిమా చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోందని తెలుస్తోంది.
టాలీవుడ్లోకి మమిత ఎంట్రీ ఇవ్వనుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ అమ్మడిని తెలుగుకు తీసుకురానుందట.. లవ్ టుడే ఫెమ్ ప్రదీప్ రంగనాథన్ తో మైత్రి మేకర్స్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మమిత హీరోయిన్ గా చేస్తుందని టాక్.