- Telugu News Photo Gallery Cinema photos Dhanashree shares heartwarming birthday post for hubby Yuzvendra Chahal
Yuzvendra Chahal: ‘నీ బిగ్గెస్ట్ చీర్ లీడర్ నేనే.. చాహల్‌కు క్యూట్‌గా బర్త్ డే విషెస్ చెప్పిన భార్య ధనశ్రీ వర్మ
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మంగళవారం (జులై 23) తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా టీమిండయా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు చాహల్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Updated on: Jul 24, 2024 | 9:37 PM

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మంగళవారం (జులై 23) తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా టీమిండయా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు చాహల్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

ఇక చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తన భర్తకు క్యూట్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. 'నీ బిగ్గెస్ట్ ఛీర్ లీడర్ ను నేనే' చాహల్ కు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో చాహల్, ధనశ్రీ వర్మల జంట ఎంతో అందంగా కనిపించింది. వీటిని చూసిన వారందరూ ' క్యూట్ కపుల్' అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

కాగా 2020లో యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మల వివాహం జరిగింది. ఆమధ్యన ధనశ్రీ వర్మ గర్భం ధరించిందని ప్రచారం జరిగింది. అయితే అది కేవలం రూమర్లు గానే మిగిలిపోయాయి.

ప్రముఖ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లా జా' తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ధన శ్రీ వర్మ. తన హుషారైన డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుందామె.

ఫేమస్ యూట్యూబర్ గా 'బిగ్ బాస్ OTT' సీజన్ 3 లోకి ధనశ్రీ వర్మ అడుగుపెడుతుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు.




