AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక వారానికి ఒకరు ఇన్ స్టాలో పాపులర్ అవుతున్నారు. ట్రెండింగ్ అంటూ చాలా మంది రకరకాల వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ అమ్మడు ఎక్కువగా ఇన్ స్టాలో పాపులర్ అవుతుంది. ఆమె పేరు శ్రీనవల్ కిషోరీ. ఈ చిన్నదాని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇప్పుడు  ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
Shri Naval Kishori
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2024 | 6:55 PM

Share

ఇన్ స్టా గ్రామ్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత మనదేశం ఎక్కువగా ఈ ఇన్ స్టా గ్రామ్ వాడుతున్నారు కుర్రకారు. ఇన్ స్టా రీల్స్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కొంతమంది తమ అందాలతో కుర్రకారుకు వలలు వేస్తుంటే మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయట పెడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక వారానికి ఒకరు ఇన్ స్టాలో పాపులర్ అవుతున్నారు. ట్రెండింగ్ అంటూ చాలా మంది రకరకాల వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ అమ్మడు ఎక్కువగా ఇన్ స్టాలో పాపులర్ అవుతుంది. ఆమె పేరు శ్రీనవల్ కిషోరీ. ఈ చిన్నదాని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎలాంటి అందాలు ఆరబోయకుండా .. వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను పెంచుకుంది ఈ చిన్నది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు పూర్తిగా భిన్నంగా ఆమె వీడియోలు ఉంటాయి. చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ వీడియోలు చేస్తుంది ఆమె. అరకొర డ్రస్సులు వేసుకొని , అందాలు ఆరబోస్తూ.. పిచ్చి పిచ్చి సాంగ్స్ , వీడియోలు చేయకుండా శ్రీనవల్ కిషోరీ ఫేమస్ అయ్యింది.

నిలువు నామాలు, కీర్తనలతో.. రీల్స్, వీడియోస్ ఆకట్టుకుంటుంది. ఇన్ స్టాలో ఎంతమంది హాట్ బ్యూటీస్ ఉన్నా కూడా కుర్రాళ్ళు ఈ అమ్మడిని తమ క్రష్ గా చెప్తున్నారు. క్యూట్ ఎక్స్ ప్రషన్స్ తో అభిమానులను సొంతం చేసుకుంటుంది. తన మేకప్ , తన డ్రస్సింగ్ తో శ్రీనవల్ యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. చాలా మంది ఈమె వీడియోలు చూసి ఆమె గురించి సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈమె రూపం మాత్రమే కాదు రీల్స్ చేసే డివోషనల్ సాంగ్స్ కు ఎక్కువగా యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇక మిగిలిన అమ్మాయిలు కూడా ఆమెలా మేకప్ వేసుకొని వీడియోలను కాపీ చేస్తున్నారు. శ్రీ నవల్ కిషోరీ దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ స్టాలో ఈ చిన్నదానికి 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆమె పేరు మీద 100కు పైగా ఫ్యాన్ పేజ్ లు ఉన్నాయి. మరి ఈ అమ్మడు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

శ్రీ నవల్ కిషోరీ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.