AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: ‘నేను కూడా డిప్యూటీ సీఎం తాలుకానే’.. పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో

విడాకుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొణిదెల నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాతో ఫుల్ బిజీగా కనపడుతోంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మెగా డాటర్ మరికొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా ప్రస్తుతం కమిటీ కుర్రోళ్లు అనే సినిమా ప్రమోషన్స్‌ లో ఉంటోంది నిహారిక. యదు వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Niharika Konidela: 'నేను కూడా డిప్యూటీ సీఎం తాలుకానే'.. పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో
Niharika Konidela
Basha Shek
|

Updated on: Jul 27, 2024 | 8:06 AM

Share

విడాకుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొణిదెల నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాతో ఫుల్ బిజీగా కనపడుతోంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మెగా డాటర్ మరికొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా ప్రస్తుతం కమిటీ కుర్రోళ్లు అనే సినిమా ప్రమోషన్స్‌ లో ఉంటోంది నిహారిక. యదు వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా సహా మొత్తం 20 మంది యంగ్ ఆర్టిస్టులు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు మంచి బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నల గడ్డ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాతగా మాట్లాడడానికి మైక్ పట్టుకుంది నిహారిక. అంతే.. అక్కడకు వచ్చిన మెగాభిమానులు ‘ పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

అభిమానుల ఈలలు, కేకలతో నిహారిక కొద్దిసేపు మోనంగా ఉండిపయింది. ఆ తర్వాత ‘నేను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకానే ” అంటూ మాట్లాడడంతో ఆడిటోరియం హర్షద్వానాలతో హోరెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన సిద్దూ నిహారికపై ప్రశంసలు కురిపించాడు. ‘ కమిటీ కుర్రోళ్లు చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారికకు థాంక్స్. ఈ మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి’ అని సిద్దూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి