Champions Trophy 2025: ‘పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’.. టీమిండియాను కోరిన షోయబ్ మాలిక్

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఒక ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. రాబోయే భవిష్యత్ దృష్ట్యా ఈ టోర్నీ నిర్వహణ పాకిస్థాన్‌కు చాలా ముఖ్యమైనది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా.. లేదా అనే విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ

Champions Trophy 2025: 'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం'.. టీమిండియాను కోరిన షోయబ్ మాలిక్
Champions Trophy 2025
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2024 | 10:34 PM

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఒక ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. రాబోయే భవిష్యత్ దృష్ట్యా ఈ టోర్నీ నిర్వహణ పాకిస్థాన్‌కు చాలా ముఖ్యమైనది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా.. లేదా అనే విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. భారత ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. పట్టు వదలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. టీమ్ ఇండియా మన దేశానికి రావాలంటే మరో మార్గం లేదని చెబుతోంది. దీనికి తోడు పలువురు పాక్ మాజీ క్రికెటర్లు.. టీమ్ ఇండియా రాకపోతే టోర్నీని పాకిస్థాన్ లోనే నిర్వహిస్తామని చెప్పారు. కాగా, టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ రావాల్సిందిగా పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ టీమిండియాను అభ్యర్థించాడు. ‘రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా అది ప్రత్యేక సమస్య. విడివిడిగా పరిష్కరించుకోవాలి. క్రీడల్లోకి రాజకీయాలు రాకూడదు. గతేడాది పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లగా ఇప్పుడు భారత జట్టుకు కూడా ఇదే మంచి అవకాశం. భారత జట్టులో పాకిస్థాన్‌లో ఆడని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ పర్యటన వారికి మంచి అవకాశంగా ఉంటుందని భావిస్తున్నాను. మేము చాలా మంచి వ్యక్తులం, అతిథులకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో మాకు బాగా తెలుసు. కాబట్టి భారత జట్టు కచ్చితంగా పాకిస్థాన్‌కు వస్తుందని నేను నమ్ముతున్నాను’ అని మాలిక్ చెప్పాడు.

PTI నివేదిక ప్రకారం, శ్రీలంకలో జరిగిన ICC వార్షిక సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చించలేదు. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాల్లో బిజీగా ఉంది. పాకిస్థాన్‌కు వచ్చేలా టీమిండియాను ఒప్పించే బాధ్యతను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి వదిలేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తయారు చేసి ఐసీసీకి పంపిన ఈ టోర్నీ డ్రాఫ్ట్‌లో.. టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వస్తే భద్రతా కారణాల దృష్ట్యా అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లో మాత్రమే ఆడతామని స్పష్టంగా పేర్కొంది. భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరినప్పటికీ భారత్ మ్యాచ్‌లు లాహోర్‌లో జరగనున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముసాయిదా ప్రకారం టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మార్చి 1న జరగాలని ప్రతిపాదించారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదు. టీమ్ ఇండియా ఈ టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఆడవచ్చు. దీని ప్రకారం, టీమ్ ఇండియా అన్ని మ్యాచ్‌లు యూఏఈ లేదా శ్రీలంకలో ఆడవచ్చు. అంతేకాకుండా, ఛాంపియన్స్ ట్రోఫీని ఆడేందుకు టీమ్ ఇండియా నిరాకరించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..