Singer Chinmayi: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ చిన్మయి

సింగర్‌ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారులు, మహిళలపై జరిగే ఆకృత్యాలు, అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన వంతు పోరాటం చేస్తుందామె. గతంలో లైంగిక బాధితురాలిగా మీటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆమె తనలాంటి మహిళల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటోంది.

Singer Chinmayi: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ చిన్మయి
John Vijay, Singer Chinmayi
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2024 | 10:15 PM

సింగర్‌ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారులు, మహిళలపై జరిగే ఆకృత్యాలు, అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన వంతు పోరాటం చేస్తుందామె. గతంలో లైంగిక బాధితురాలిగా మీటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆమె తనలాంటి మహిళల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటోంది. వైరముత్తు లాంటి సినీ దిగ్గజాలపై సైతం తరచూ కామెంట్స్ చేస్తుంది శ్రీ పాద. తాజాగా ప్రముఖ నటుడు జాన్‌ విజయ్‌ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చిన్మాయి ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అతను అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అతని విచిత్ర ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని సింగర్ తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్మయి. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇందులో ఉంది.

కాగా జాన్ విజయ్ కూడా డీఎంకేకి చెందిన వ్యక్తి అని, వైరముత్తు, ఇతను ఒకే రకానికి చెందిన వ్యక్తులు అని సింగర్ ఆరోపించింది. ఇక చిన్మయి పెట్టిన పోస్ట్ మీద కొందరు అమ్మాయిలు కూడా రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇతగాడు పబ్బులు, క్లబ్బులో దారుణంగా ప్రవర్తిస్తాడని, సెలెబ్రిటీ అన్న పొగరు చూపిస్తాడని, అందరితోనూ అమర్యాదగానే ప్రవర్తిస్తాడని నటుడిపై ఆరోపణలు చేశారు. అలాగే ఒంటరిగా మహిళ కనిపిస్తే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడని చెబుతున్నట్టుగా ఈ పోస్ట్‌లో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

జాన్ విజయ్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాడు. విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ‘ఓరం పో’, ‘సర్పట్ట పరంబరై, ‘సలార్: పార్ట్ 1- సీజ్‌ఫైర్‌’ లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్‌ నటించిన సలార్‌ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు. అలాగే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు జాన్ విజయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.