AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Mokshagna: ‘మీ అంచనాలకు మించి’.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన మోక్షజ్ఞ మూవీ.. పోస్ట్ వైరల్

తన డెబ్యూ మూవీకి ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే ఎంచుకున్నాడు మోక్షు. గతంలో చాలా బొద్దుగా కనిపించిన అతను తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం.

Nandamuri Mokshagna: 'మీ అంచనాలకు మించి'.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన మోక్షజ్ఞ మూవీ.. పోస్ట్ వైరల్
Nandamuri Mokshagna
Basha Shek
|

Updated on: Jul 27, 2024 | 7:36 PM

Share

టాలీవుడ్ లో మరో స్టార్ కిడ్ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి రెడీ అయ్యాడు. తన డెబ్యూ మూవీకి ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే ఎంచుకున్నాడు మోక్షు. గతంలో చాలా బొద్దుగా కనిపించిన అతను తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆ మధ్యన తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని మరో ట్వీట్‌ చేశాడు. తాజాగా తన డెబ్యూ మూవీపై మరో అప్ డేట్ ఇచ్చాడు బాలయ్య వారసుడు. ఇందులో తన సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు. ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అని ట్వీట్ చేశాడు మోక్షజ్ఞ. ఈ పోస్టుకు హైఫై, బ్లాస్ట్, ఫైర్ ఏమోజీలు జత చేశాడు. అలాగే తన పోస్టకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ట్యాగ్ చేశాడు

ప్రస్తుతం మోక్షజ్ఞ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నందమూరి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంటుంది? హీరోయిన్ ఎవరు? స్టోరీ ఎలా ఉండబోతోంది? బాలయ్య ఉంటారా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ చేయబోతున్న ఫస్ట్ మూవీ హిట్ అందుకోవాలని ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు. కాగా బాలకృష్ణ- ప్రశాంత్ వర్మల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆహా అన్ స్టాపబుల్ షోకు ప్రశాంత్ వర్మనే డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా ప్రశాంత్ వర్మ చేతుల్లోనే పెట్టాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నందమూరి మోక్షజ్ఞ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..