- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh Gives Clarity About Her Marriage Rumours In Raghu Thatha Movie Promotions
Keerthy Suresh: అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
సినిమా తారలపై పెళ్లి రూమర్లు రావడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. అయితే పదే పదే ఇలాంటి రూమర్లు వస్తే మాత్రం రియాక్ట్ అవ్వక తప్పడం లేదు. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేశ్ ది ప్రస్తుతం అలాంటి పరిస్థితనే ఎదుర్కొంటోంది.
Updated on: Jul 27, 2024 | 9:43 PM

సినిమా తారలపై పెళ్లి రూమర్లు రావడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. అయితే పదే పదే ఇలాంటి రూమర్లు వస్తే మాత్రం రియాక్ట్ అవ్వక తప్పడం లేదు. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేశ్ ది ప్రస్తుతం అలాంటి పరిస్థితనే ఎదుర్కొంటోంది.

తెలుగు, తమిళంతో పాటు ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది కీర్తి సురేశ్. హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే బిజీ బిజీగా ఉంటోంది.

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. డైరెక్టర్ సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిల్స్మ్ బ్యానర్ నిర్మించింది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యన కీర్తి సురేశ్ పెళ్లి వార్తలు పలు సార్లు తెరమీదకు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో పెళ్లిపీటలెక్కనుందని లేటెస్ట్ రూమర్.

తాజాగా వీటిపై స్పందించిన కీర్తి సురేశ్.. 'నాపై వచ్చే రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తుంటే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ కాను. కేవలం నా సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాను' అని చెప్పుకొచ్చింది.

'ఇక నా వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోను.. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అంటూ తన పెళ్లి వార్తలను కొట్టిపారేసింది కీర్తి సురేశ్.





























