- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi And Family Attend Paris 2024 Olympics Opening Ceremony, Photos Here
Chiranjeevi: పారిస్ వీధుల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్ మాత్రం క్లింకారనే.. ఫొటోస్ చూశారా?
ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పారిస్‌లో జరిగిన ఈ వేడుకలు చూసేందుకు లక్షలాది మంది క్రీడా ప్రేమికులతో సహా పలువురు సినీ తారలు తరలివచ్చారు.
Updated on: Jul 30, 2024 | 6:30 PM

ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పారిస్‌లో జరిగిన ఈ వేడుకలు చూసేందుకు లక్షలాది మంది క్రీడా ప్రేమికులతో సహా పలువురు సినీ తారలు తరలివచ్చారు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లింకార కొణిదెల ప్రస్తుతం పారిస్ లోనే ఉంటున్నారు.

ఈ సందర్భంగా సతీమణితో సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని పోజులిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇది తమ జీవితంలో సంతోషకరమైన క్షణమంటూ మురిసిపోయారు.

ఈ సందర్భంగా ఒలింపిక్స్ లో భారత దేశం తరఫును ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అందరికీ తన శుభాకాంక్షలు తెలియచేసారు చిరంజీవి

ఇక రామ్ చరణ్, ఉపాసన, క్లింకార కూడా పారిస్ వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.




