AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. చిరిగిపోతున్నాయంటూ గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు

ఆట సంగతి పక్కన పెడితే.. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల దుస్తులపై రచ్చ కొనసాగుతోంది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు ధరించిన చీరపై ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా కూడా స్పందించింది.

Paris Olympics 2024: ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. చిరిగిపోతున్నాయంటూ గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
Gutta Jwala, PV Sindhu
Basha Shek
|

Updated on: Jul 28, 2024 | 9:26 PM

Share

పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భారత క్రీడాకారులు కూడా పతకాల కోసం శాయశక్తులా పోరాడుతున్నారు. ఆదివారం మహిళా షూటర్ మను భాకర్ కాంస్యంతో మెరివడంతో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరిచింది. అలాగే స్టార్ షట్లర్ పీవీ సింధు, హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా తొలి రౌండ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించి తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆట సంగతి పక్కన పెడితే.. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల దుస్తులపై రచ్చ కొనసాగుతోంది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు ధరించిన చీరపై ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా కూడా స్పందించింది. దుస్తులు మరీ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది.

‘ఒలింపిక్స్ లో టీమ్‌ ఇండియా దుస్తులు డిజైన్‌ చేసిన వారిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇవి క్రీడాభిమానులను చాలా నిరాశపరిచాయి. అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాకపోవచ్చు. డిజైనర్లు ఈ విషయాన్ని ఎలా ఆలోచించలేకపోయారు. రెడీ టు వేర్ శారీ తయారు చేసి ఉంటే సులభమయ్యేది. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించడానికి డిజైనర్లకు అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. దుస్తులు మరీ తీసికట్టుగా ఉండడంతో చిరిగిపోతున్నాయి. ఇవి అసలు సౌకర్యంగా లేవు.ఇప్పటికైనా క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యత విషయంలో దృష్టి సారించాలి’అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది గుత్తా జ్వాల. కాగా ఈ ఒలింపిక్స్ దుస్తులను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించారు.

ఇవి కూడా చదవండి

జ్వాలా గుత్తా పోస్ట్ ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..