AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ కమెడియన్.. స్మితా సబర్వాల్ దగ్గర ఉద్యోగం మానేసి మరీ సినిమాల్లోకి.. గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ తో పోజులిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్. తెలంగాణలోని ఓ పల్లెటూరుకు చెందిన అతను చిన్నప్పటి నుంచే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మిమిక్రీ కూడా నేర్చుకున్నాడు. పలు టీవీ షోల్లో కూడా పాల్గొని సత్తా చాటాడు

ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ కమెడియన్.. స్మితా సబర్వాల్ దగ్గర ఉద్యోగం మానేసి మరీ సినిమాల్లోకి.. గుర్తు పట్టారా?
Tollywood Actor Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 28, 2024 | 9:41 PM

Share

పై ఫొటోలో ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ తో పోజులిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్. తెలంగాణలోని ఓ పల్లెటూరుకు చెందిన అతను చిన్నప్పటి నుంచే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మిమిక్రీ కూడా నేర్చుకున్నాడు. పలు టీవీ షోల్లో కూడా పాల్గొని సత్తా చాటాడు. టాప్ కామెడీ షో జబర్దస్త్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ యాసలో ఈ నటుడు చెప్పే డైలాగులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘తీస్కోలే రొండు లచ్చల కట్నం’, ‘ఒక రెండు నిమిషాలు ఆగుతావా’ వంటి తన దైన ట్రేడ్ మార్క డైలాగులతో టాలీవుడ్ లో రచ్చ చేస్తోన్న ఈ కమెడియన్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. అతను మరెవరో కాదు రచ్చ రవి. పేరుకు తగ్గట్టుగానే రవి ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ ఉంటుంది. ఇది అతని చిన్ననాటి ఫొటో. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రచ్చ రవి కొన్ని రోజుల క్రితమే ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.

కాగా ఉదయభాను యాంకర్ గా వ్యవహరించిన వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రాంలో తొలిసారిగా మిమిక్రీ ప్రదర్శన ఇచ్చాడు రచ్చ రవి. అయితే సినిమా అవకాశాలు రాకపోవడంతో హైదరాబాద్ నుంచి తిరిగి వరంగల్ వచ్చేశాడు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి చేరాడు. కొంత కాలం పాటు ప్రముఖ ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని చేశాడు. అయితే నటనపై ఆసక్తితో మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దుబాయ్ వెళ్లి అక్కడ రేడియో జాకీగా చేరాడు. అక్కడ అతని ప్రోగ్రాంకు మంచి స్పందన రావడంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై సినిమాల్లోకి అడుగు పెట్టాడు. శతమానం భవతి, గద్దల కొండ గణేశ్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, నారప్ప, బలగం, భగవంత్ కేసరి, భీమా, ఓం భీమ్ బుష్ తదితర సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు రచ్చ రవి.

ఇవి కూడా చదవండి

బాలకృష్ణతో రచ్చ రవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..