Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కత్తి దూస్తోన్న ఈ కుందనపు బొమ్మను గుర్తు పట్టారా? అప్పట్లో స్టార్ హీరోయిన్.. ఒక్క సినిమాతో సెన్సేషన్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో వివిధ భాషలకు చెందిన స్టార్ యాక్టర్స్ నటించనున్నారు.ప్రభాస్‌, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, డా.మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితర సినీ దిగ్గజాలు ఈ సినిమాలో పాలు పంచుకోనున్నారు

Tollywood: కత్తి దూస్తోన్న ఈ కుందనపు బొమ్మను గుర్తు పట్టారా? అప్పట్లో స్టార్ హీరోయిన్.. ఒక్క సినిమాతో సెన్సేషన్
Tollywood Senior Actress
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2024 | 8:59 PM

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో వివిధ భాషలకు చెందిన స్టార్ యాక్టర్స్ నటించనున్నారు.ప్రభాస్‌, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, డా.మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితర సినీ దిగ్గజాలు ఈ సినిమాలో పాలు పంచుకోనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. తాజాగా కన్నప్ప సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతే కాదు ఆమె ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఆమె మరెవరో కాదు అలనాటి హీరోయిన్ మధుబాల. గతంలో ఎన్నో మరపురాని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా అలరించింది. మణిరత్నం తెరకెక్కించిన రోజా లాంటి కల్ట్ క్లాసిక్ చిత్రంతో మధుబాల చాలా పాపులర్ అయింది. తెలుగుతో పాటు హిందీ , తమిలం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి ఆడియెన్స్ ఆదరాభిమానాలు సొంతం చేసుకుందీ అందాల తార. తెలుగులో అల్లరి ప్రియుడు, చిలక్కొట్టుడు, ఆవేశం, గణష్ తదితర సినిమాల్లో నటించింది మధుబాల.

అయితే పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మధుబాల ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రేమదేశం, శాకుంతలం, ఈగల్ తదిర సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు మంచు విష్ణు హీరోగా చేస్తోన్న కన్నప్పలోనూ కీ రోల్ చేస్తోంది. ఇందులో పన్నగ అనే పాత్రలో వీర నారిగా నటిస్తుంది మధు బాల. తాజాగా సినిమాలో ఆమె లుక్ కు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కత్తి పట్టుకుని ఉగ్రరూపంలో కనిపించిందీ సీనియర్ నటీమణి. ప్రస్తుతం మధు బాల లుక్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలువున్నాయి.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో నటి మధు బాల లుక్..

సీనియర్ నటుడు శరత్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పిల్లలు అడ్డుకున్నా ఆగని అమ్మానాన్న ప్రాణాలు..!
పిల్లలు అడ్డుకున్నా ఆగని అమ్మానాన్న ప్రాణాలు..!
ఛాంపియన్ సౌతాఫ్రికాపై కాసుల వర్షం.. టీమిండియాకు ఎన్ని కోట్లంటే?
ఛాంపియన్ సౌతాఫ్రికాపై కాసుల వర్షం.. టీమిండియాకు ఎన్ని కోట్లంటే?
వామ్మో.. శరీరంలో అది పెరిగితే మోకాళ్ల నొప్పులు వస్తాయా..?
వామ్మో.. శరీరంలో అది పెరిగితే మోకాళ్ల నొప్పులు వస్తాయా..?
రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో బీబీపేట్ గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో బీబీపేట్ గ్రామస్తులు
బ్రాహ్మణులు శిఖ ఎందుకు ఉంచుతారు.? పండితులు ఏమి అంటున్నారంటే.?
బ్రాహ్మణులు శిఖ ఎందుకు ఉంచుతారు.? పండితులు ఏమి అంటున్నారంటే.?
WTC Final: డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కల సాకారం
WTC Final: డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కల సాకారం
సూపర్ న్యూస్.. సంతానలేమికి సొల్యూషన్ కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ..
సూపర్ న్యూస్.. సంతానలేమికి సొల్యూషన్ కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ..
టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!
జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!