AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshana OTT: అఫీషియల్.. ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం రక్షణ. ఇప్పటివరకు ప్రేమ కథలు, నెగిటివ్ రోల్స్, రొమాంటిక్ సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్ మొదటి సారిగా ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మముడి మానస్ విలన్ రోల్ లో నటించడం విశేషం.జూన్ 7 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Rakshana OTT: అఫీషియల్.. ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Rakshana Movie
Basha Shek
|

Updated on: Jul 29, 2024 | 8:21 PM

Share

మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం రక్షణ. ఇప్పటివరకు ప్రేమ కథలు, నెగిటివ్ రోల్స్, రొమాంటిక్ సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్ మొదటి సారిగా ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మముడి మానస్ విలన్ రోల్ లో నటించడం విశేషం.జూన్ 7 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ నటన అదిరిపోయిందని రివ్యూలు వచ్చాయి. దీనికి తోడు రిలీజ్ కు ముందు రక్షణ సినిమా బాగా వార్తల్లో నిలిచింది. ఎప్పుడో పూర్తయిన సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నారని.. రెమ్యూనరేషన్ సైతం ఇవ్వకుండా ప్రమోషన్స్ కి రావాలని కోరుతున్నారంటూ పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చిత్ర బృందం సైతం పాయల్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. ఇలా పలు వివాదాలు ఇన్ డైరెక్టు గా ఈ సినిమా ప్రమోషన్స్ కు ఉపయోగపడ్డాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రక్షణ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రక్షణ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

తాజాగా రక్షణ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 1 నుంచి తమ ఓటీటీలో పాయల్ రాజ్ పుత్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ ట్వీట్ చేసింది. ‘లేడీ సింగ్‌ గర్జించేందుకు వస్తోంది’ అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. రక్షణ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ పవర్ ఫుల్ ఏసీపీ పాత్రలో అలరించారు. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహించారు. శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా, ఆనంద్ చక్రపాణి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో పాయల్ రాజ్ పుత్ సినిమాను మిస్ అయ్యారా? అయితే మరో రెండు రోజులు ఆగండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

పాయల్ రాజ్ పుత్ రక్షణ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?