Telugu Indian Idol 3: ఇండియన్ ఐడల్ నుంచి రజనీ శ్రీ పూర్ణిమ ఔట్.. తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తానన్న తమన్
శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సింగింగ్ ట్యాలెంట్ షో ఎలిమినేషన్ రౌండ్‌లో శ్రీ ధృతి, స్కంద, రజని శ్రీ పూర్ణిమ డేంజర్ జోన్ లో నిలిచారు. అయితే స్కంద కు అత్యధిక ఓట్టు పడ్డాయి. దీంతో తను సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత శ్రీ ధృతి కూడా సేఫ్ అని తేలింది. దీంతో రజని శ్రీ పూర్ణిమ ఎలిమినేట్ కాక తప్పలేదు
తెలుగు ఇండియన్ ఐడల్ 3 లో బిగ్ ట్విస్ట్. ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్‌లో రజనీ శ్రీ పూర్ణిమ ఎలిమినేట్ అయ్యింది. ఈ సీజన్‌లో ఇంతకు ముందు కుశాల్ శర్మ, హరి ప్రియ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు రజని శ్రీ పూర్ణిమ కూడా ఎలిమినేట్ అయ్యింది. తద్వారా ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సంఖ్య మూడుకు చేరుకుంది. శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సింగింగ్ ట్యాలెంట్ షో ఎలిమినేషన్ రౌండ్‌లో శ్రీ ధృతి, స్కంద, రజని శ్రీ పూర్ణిమ డేంజర్ జోన్ లో నిలిచారు. అయితే స్కంద కు అత్యధిక ఓట్టు పడ్డాయి. దీంతో తను సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత శ్రీ ధృతి కూడా సేఫ్ అని తేలింది. దీంతో రజని శ్రీ పూర్ణిమ ఎలిమినేట్ కాక తప్పలేదు. కాగా రజని శ్రీ ఎలిమినేషన్ పై షో జడ్జి, సింగర్ కార్తీక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రజన శ్రీ తన సింగింగ్ జర్నీని కొనసాగించాలని కోరారు. భవిష్యత్ లో తప్పకుండా తన స్టూడియోలో ఆమెను చూస్తారని మాటిచ్చాడు. మరో జడ్జి గీతా మాధురి కూడా రజనీకి ధైర్యం చెప్పింది. పాజిటివ్ దృక్పథంతో ఉండాలని, తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించాలని కోరారు.
మరో జడ్జి ఎస్ థమన్ కూడా రజని శ్రీకి మాటిచ్చాడు. భవిష్యత్తులో ఈ యంగ్ సింగర్ తో కలసిఇ కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. నిరాశ పడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆమెకు భరోసానిచ్చాడు థమన్. ఇక ఈ ఎపిసోడ్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన న్యాయనిర్ణేత డ్రమ్స్ శివమణి రజనీ శ్రీ పూర్ణిమ ట్యాలెంట్ పై ప్రశంసలు కురిపించారు. తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రోత్సహించారు. కాగా రజనీ శ్రీ పూర్ణిమ నిష్క్రమణతో అందరూ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు మొదటి స్థానం కోసం తొమ్మిది మంది పోటీదారులు పోటీ పడుతున్నారు. పబ్లిక్ ఓటింగ్, న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా వీక్లీ ఎలిమినేషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు ఆహా యాప్ ద్వారా లేదా ప్రతి పోటీదారు కోసం నియమించబడిన నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా ఓటు వేయవచ్చు. ఆన్ లైన్ ఓటింగ్ లైన్లు శుక్రవారం నుండి 7 గంటలకు ఓపెన్ అవుతాయి. ఆదివారం వరకు ఉదయం 7 గంటల వరకు ఈ అవకాశం ఉంంటుంది.
Memu vinna anni Rooba versions lo ide best 🔥🔥
Watch now ▶️ https://t.co/AzjrM3jot6@geethasinger @MusicThaman @drumssivamani @singer_karthik pic.twitter.com/mqPFRK6N4e
— ahavideoin (@ahavideoIN) July 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.