OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
మరో కొత్త నెల వచ్చేసింది. కల్కి తప్పితే మరో సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ఈ వారం కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. రాజ్ తరుణ్ తిరగబడరా సామీ, అల్లు శిరీష్ బడ్డీ, ఉషా పరిణయం సినిమాలు బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానిపైనా బజ్ లేదు.
మరో కొత్త నెల వచ్చేసింది. కల్కి తప్పితే మరో సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ఈ వారం కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. రాజ్ తరుణ్ తిరగబడరా సామీ, అల్లు శిరీష్ బడ్డీ, ఉషా పరిణయం సినిమాలు బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానిపైనా బజ్ లేదు. మరో వైపు ఓటీటీలలో మాత్రం 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రాజమౌళి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్’ కాస్త ఆసక్తి కలిగిస్తోంది. అలాగే సౌతిండియన్ క్వీన్ త్రిష మొదటి సారిగా నటించిన వెబ్ సిరీస్ బృందా పై కూడా బజ్ క్రియేట్ అవుతోంది. వీటితో పాటు కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ పార్ట్ 2 లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఇంగ్లిష్, హిందీ సినిమాలు స్ట్రీమింగ్ లిస్టులో ఉండనున్నాయి. మరి ఆగస్టు మొదటి వారంలో ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది కింద లిస్టులో చూద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
- ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01
- బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేసియన్ సినిమా) – ఆగస్టు 01
- లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01
- మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ మూవీ) – ఆగస్టు 01
- అన్ స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01
- మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ) – ఆగస్టు 02
- సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 02
అమెజాన్ ప్రైమ్
- ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 29
- బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ఫ్యుచరమా సీజన్ 12 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 29
- నో వే ఔట్ (కొరియన్ వెబ్ సిరీస్) – జూలై 31
- కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 02
బుక్ మై షో
- ద బైక్ రైడర్స్ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 02
జియో సినిమా
- డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 01
- గుహ్డ్ చడీ (హిందీ మూవీ) – ఆగస్టు 01
- టరోట్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – ఆగస్టు 03
- దస్ జూన్ కీ రాత్ (హిందీ సిరీస్) – ఆగస్టు 04
సోనీ లివ్
- బృందా (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 02
ఆపిల్ ప్లస్ టీవీ
- ఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లిష్ సిరీస్) – జూలై 31
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.