కునుకేశారో దెయ్యానికి దొరికిపోతారు.! సీన్ సీన్‌కు సుస్సుపడాల్సిందే.. మూవీ ఏ ఓటీటీలో చూడొచ్చునంటే
తెలుగులో హారర్ మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలే కాదు.. ఇకపై కూడా సరికొత్త కాన్సెప్ట్స్‌తో హారర్ మూవీస్ తెరకెక్కించాలని మేకర్స్ స్కెచ్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొరియన్ భాషలో థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ కాన్సెప్ట్‌లకు కొదవలేదు. ఇప్పుడు మేము చెప్పబోయే చిత్రం..
తెలుగులో హారర్ మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలే కాదు.. ఇకపై కూడా సరికొత్త కాన్సెప్ట్స్‌తో హారర్ మూవీస్ తెరకెక్కించాలని మేకర్స్ స్కెచ్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొరియన్ భాషలో థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ కాన్సెప్ట్‌లకు కొదవలేదు. ఇప్పుడు మేము చెప్పబోయే చిత్రం కూడా ఆ కోవకు చెందినదే. ఈ మూవీ కొరియన్‌లోనే కాదు.. తెలుగులోకి అందుబాటులో ఉంది. సుమారు గంటన్నర నిడివి ఉన్న ఈ హారర్ మూవీ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
వైఫ్ అండ్ హస్బండ్.. హ్యాపీ లైఫ్. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడం.. ఇలా వారి జీవితాల్లో అన్ని సంతోషాలే ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఆమె భర్తకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఒక్కసారి పడుకున్నాడంటే.. ఏం చేస్తాడు.? ఎలా బిహేవ్ చేస్తాడు.? ఎంత భయంకరంగా మారిపోతాడో.? అస్సలు ఊహించలేం. పగలంతా బాగానే ఉండే తన భర్త రాత్రి అయ్యేసరికి ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తాడు.? అతడ్ని ఏమైనా ఆత్మ ఆవహించిందా.? భర్తను కాపాడుకోవడానికి ఆమె ఎంత దూరం వరకు వెళ్లింది.? అనే ప్రశ్నలకు ఈ సినిమా సమాధానం ఇస్తుంది. ఈ చిత్రం పేరు ‘స్లీప్’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అటు కొరియన్.. ఇటు తెలుగులో అందుబాటులో ఉంది.
హారర్ జోనర్ వచ్చిన సినిమాల్లో కంటే.. ఈ మూవీ కొంచెం డిఫెరెంట్ అని చెప్పొచ్చు. దెయ్యాలు అనేవి చూపించకుండా.. స్లీప్ వాకింగ్ అనే డిజార్డర్‌తో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మూవీలో ప్రతీ సీన్ ఓ డైమండ్ అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాంక్. లేట్ ఎందుకు మీరూ ఓసారి మూవీపై లుక్కేయండి.
ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి