Sai Durgha Tej: పెళ్లి వార్తలపై స్పందించిన సాయి దుర్గా తేజ్.. ఏమన్నారంటే..
అదే మెగా హీరో సాయి దుర్గా తేజ్ వివాహం గురించి. తేజ్ టాలీవుడ్‌కి చెందిన ఒక హీరోయిన్‌తో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అటు ఆ హీరోయిన్ కానీ, సాయి తేజ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ విషయమై తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన...
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో నిత్యం ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. పలానా హీరోయిన్ పలానా హీరోతో ప్రేమలో ఉందని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. తాజాగా ఇలాంటి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
అదే మెగా హీరో సాయి దుర్గా తేజ్ వివాహం గురించి. తేజ్ టాలీవుడ్‌కి చెందిన ఒక హీరోయిన్‌తో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అటు ఆ హీరోయిన్ కానీ, సాయి తేజ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ విషయమై తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన పెళ్లి, ప్రేమ అంటూ జరుగుతోన్న చర్చపై స్పందించాడు. ‘మీ లవ్ గురించి చెప్పండి’ అంటూ యాంకర్ అడగ్గా.. ‘నాది వన్‌సైడ్ లవ్’ అటు నుంచి ఎలాంటి స్పందన లేదంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు తేజ్.
ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనే సమాధానం వస్తోంది. నాకు పెళ్లా?అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇలా పెళ్లి గురించి సమాధానాన్ని దాటవేశాడు తేజ్. అయితే మొన్నటి వరకు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అర్థమన్నమాట. కాగా పవన్ కళ్యాణ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై స్పందించిన తేజ్.. తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘బాల్యంలో నేను ఓ టోర్నమెంట్‌లో ఓడిపోయా. చాలా బాధపడుతూ ఇంటికొచ్చా. ఆ సమయంలో మామయ్య (పవన్) భరోసా ఇస్తూ.. ‘ఒక్కసారే కాదురా నువ్వు పది సార్లు ఓడినా ఫర్వాలేదు. కానీ, ఆట బాగా ఆడాలి’ అని చెప్పారు. ఆరోజు ఆయన ప్రోత్సాహంతో తర్వాత విన్ అయ్యా. నేను గెలిచిన రోజు ఆయన ఎలా ఆనందించారో.. ఆయన గెలుపును నేను అలా ఎంజాయ్ చేశా’’ అని చెప్పుకొచ్చాడు తేజ్.
సాయి తేజ్ ఫుల్ స్పీచ్ ఇక్కడ చూడండి..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..