Ravi Kiran |
Updated on: Jul 17, 2024 | 8:54 PM
ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు తమిళ హీరోయిన్ దివ్యభారతి. ఈ భామ చేసిన మొదటి చిత్రంతోనే మాంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకుంది.
తమిళంలో 'బ్యాచిలర్' మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన దివ్యభారతి.. తొలి చిత్రంలోనే బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోవడమే కాదు.. లిప్ లాక్ సీన్స్‌లోనూ నటించి అందరికీ షాక్ ఇచ్చింది.
1992, జనవరి 28న కోయంబత్తూరులో జన్మించిన ఈ బ్యూటీ.. తన తొలి తమిళ చిత్రంతోనే కుర్రాళ్లలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించింది. మొదటి సినిమాలోనే బోల్డ్ సీన్స్‌లో నటించి కుర్రకారుకు హీట్ పెంచింది.
ప్రస్తుతం ఈమె ఖాతాలో ‘మధిల్ మెల్ కాదల్’, ‘కింగ్‌స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’, ‘G.O.A.T – Greatest Of All Time’ లాంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే ఈ భామ ‘జర్నీ’ అనే వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
కాగా, దివ్యభారతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫోటోలు, తన సినిమా అప్‌డేట్స్ ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి.