Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? స్టార్ హీరో కొడుకు.. ఇప్పుడు క్రేజీ హీరో

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా? ఒక స్టార్ హీరో కుమారుడైన ఆ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా వెలుగొందుతున్నాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడి అవార్ట్ తో పాటు, సౌత్ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు

Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? స్టార్ హీరో కొడుకు.. ఇప్పుడు క్రేజీ హీరో
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2024 | 5:59 PM

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా? ఒక స్టార్ హీరో కుమారుడైన ఆ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా వెలుగొందుతున్నాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడి అవార్ట్ తో పాటు, సౌత్ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు. అలాగే టాలీవుడ్ లో తరుణ్ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం ప్రేమ కథా చిత్రాలతోనే కాకుండా యాక్షన్ మూవీస్ తోనూ తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాడీ యంగ్ హీరో. మధ్యలో వరుసగా ప్లాఫ్ లు ఎదుర్కొన్నప్పటికీ నిరాశ చెందుకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో మరెవరో కాదు ఆది సాయి కుమార్. ఇది అతని చిన్ననాటి ఫొటో. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఆదిని ఎత్తుకొని కనిపించారు. ఇక ఫొటో విషయానికి వస్తే..ఆది సాయి కుమార్ తండ్రి హీరో సాయి కుమార్‌ నటించిన కలికాలం సెట్స్ కు సంబంధించినది. ఆ సినిమా ఫంక్షన్ లోనే చిరంజీవి ఆదిని ఎత్తుకుని ఇలా ముద్దు చేశారు.

సాయి కుమార్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. 2011లో ‘ప్రేమ కావాలి’ అంటూ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, గాలి పటం, రఫ్, గరం, చుట్టాలబ్బాయి, శమంతకమణి, జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, అతిథి దేవో భవ, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో, సీఎస్‌ఐ సనాతన్ తదితర సినిమాలతో యాక్షన్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

 తండ్రి సాయి కుమార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన ఆది సాయి కుమార్..

View this post on Instagram

A post shared by ActorAadi (@aadipudipeddi)

అలాగే పులి మేక వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను కూడా అలరించాడు. ప్రస్తుతం జంగిల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ.. ఛాప్టర్ వన్ తదితర క్రేజీ ప్రాజెక్టులు ఆది సాయి కుమార్ చేతిలో ఉన్నాయి.\

మెగాస్టార్ చిరంజీవితో సాయి కుమార్, ఆది సాయి కుమార్..

View this post on Instagram

A post shared by ActorAadi (@aadipudipeddi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్