Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో ఒక్క ఫొటో ఇప్పించవా? నిహారికను బతిమాలుకున్న హీరోయిన్.. ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు సినిమాల్లోనే స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేశాడు. పవన్ కల్యాన్‌ జనసేన పార్టీ ఏకంగా 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్ కల్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో ఒక్క ఫొటో ఇప్పించవా? నిహారికను బతిమాలుకున్న హీరోయిన్.. ఎవరంటే?
Pawan Kalyan, Niharika
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2024 | 4:43 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు సినిమాల్లోనే స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేశాడు. పవన్ కల్యాన్‌ జనసేన పార్టీ ఏకంగా 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్ కల్యాణ్. సాధారణ జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లోనూ పవర్ స్టార్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, డైరెక్టర్లు పవన్ కు అభినందనలు తెలిపారు. చాలామంది స్వయంగా పవర్ స్టార్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ పవన్ కల్యాణ్ తో సెల్ఫీ లేదా ఫొటో ఇప్పించమని మెగా డాటర్ నిహారికను స్పెషల్‌ రిక్వెస్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు పూర్ణ. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీషోలతో బిజీ బిజీగా ఉంటోందీ సీనియర్ హీరోయిన్. ఆమె జడ్జిగా వ్యవహరిస్తోన్న ఓ టీవీ షోకు ఇటీవల నిహారిక కూడా గెస్ట్ గా హాజరైంది. ఈ షోలో పవన్ కల్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు సూపర్బ్ స్కిట్ వేశారు. ప్రస్తుతం ఈ స్కిట్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది.

ఈ నేపథ్యంలో పిల్లల స్కిట్ పూర్తయ్యాక నటి పూర్ణ పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 8నాకు పవన్ కల్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక.. ఒక్కసారి ఎప్పుడైనా నాకు ఆయనతో ఒక్క ఫొటో ఇప్పించు’ అని రిక్వెస్ట్ చేసింది పూర్ణ. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని విన్న పవన్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. పవర్ స్టార్ రేంజ్ అంటే ఇలాగే ఉంటదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో పలు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూర్ణ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, స్పెషల్ రోల్స్ తోనూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది పూర్ణ. అలాగే టీవీ షోలతోనూ బుల్లితెర ఆడియెన్స్ కు వినోదం పంచుతోంది.

ఇవి కూడా చదవండి

కుమారుడితో నటి పూర్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే