AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: నేను చేయను మావయ్య.. నువ్వే చేసుకో.. ఆ దర్శకుడికి షాకిచ్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అసలు పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సీనియర్ హీరో కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

Mahesh Babu: నేను చేయను మావయ్య.. నువ్వే చేసుకో.. ఆ దర్శకుడికి షాకిచ్చిన మహేష్..
Mahesh Babu Rajakumarudu
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2024 | 4:31 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అసలు పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సీనియర్ హీరో కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మహేష్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. డిఫరెంట్ కథలతో.. వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించాడు. బాలనటుడిగా అనేక చిత్రాల్లో అలరించిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1999 జూలై 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మహేష్. ఇందులో మహేష్ సరసన ప్రీతి జింటా కథానాయికగా నటించగా.. మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన రాజకుమారుడు మూవీ విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.

బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించిన మహేష్.. 1990లో బాలచంద్రుడు సినిమాలో చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అయితే మహేష్ హీరోగా యమలీల సినిమా రావాల్సి ఉంది. కృష్ణకు కథ నచ్చడంతో రెండు మూడేళ్లు వెయిట్ చేయాలని అన్నారు. కానీ సినిమా ఆలస్యమవుతుండడంతో అలీ హీరోగా నటించగా.. సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ బాగా నచ్చడంతో.. దర్శకుడు రాఘవేంద్రరావుకు మహేష్ తొలి సినిమాకు డైరెక్షన్ చేయాలని కోరారు. అలా మహేష్ మొదటి సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ముహూర్త సన్నివేశానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టారు. 1999 జూలై 30న ఈ సినిమా మొత్తం 78 ప్రింట్స్ తో 116 స్క్రీన్స్ లో రిలీజ్ చేసారు. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ 100 రోజులు థియేటర్లలో ప్రదర్శితమయ్యింది. ఈ సినిమాతోనే మహేష్ బాబుకు ప్రిన్స్ అనే ట్యాగ్ ఇచ్చారు.

Rajakumarudu Movie

Rajakumarudu Movie

హీరోగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తనదైన నటన, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్లతో అదరగొట్టాడు మహేష్. మొత్తం 44 కేంద్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా రూ.10 కోట్లు వసూలు చేసింది. అయితే మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి రాఘవేంద్రరావును మావయ్య అని పిలవడం అలవాటు. సినిమా షూటింగ్ సమయంలోనూ అలాగే పిలిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ప్రీతిజింటాతో ముద్దు సన్నివేశం ప్లాన్ చేశారు. కూల్ డ్రింక్ బాటిల్ తీసుకువచ్చి అందులో ఒక స్ట్రా వేసి ప్రీతి జింతా తాగిన తర్వాత ఆ స్ట్రాతోనే మహేష్ తాగాలని చెప్పారట. దీంతో “నేను చేయను మావయ్య.. కావాలంటే నువ్వు చేసుకో” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ రాఘవేంద్రరావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.