AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thangalaan Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న విక్రమ్ ‘తంగలాన్’.. రన్ టైమ్ ఎంతంటే..?

భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తోన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల రాశి మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. అలాగే పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Thangalaan Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న విక్రమ్ 'తంగలాన్'.. రన్ టైమ్ ఎంతంటే..?
Thangalaan
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2024 | 2:21 PM

Share

విభిన్నమైన కంటెంట్ ట్రై చేయడంలో ముందుంటారు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కనిపించిన విక్రమ్.. ఇప్పుడు తంగలాన్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తోన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల రాశి మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. అలాగే పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

కోలార్ బంగారు గనుల నేపథ్యంలో అక్కడ పని చేసే కార్మికుల ఇతివృత్తంతో రూపొందించిన ఈ సినిమా విడుదల తేదీని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆగస్ట్ 15వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తంగళాన్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు తంగలాన్ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. విక్రమ్, మాళవికా మోహనన్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారని ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లతోనే తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి కాస్ట్యూమ్స్, మేకప్ కోసం దాదాపు నాలుగు గంటలకు పైగా కష్టపడ్డారని.. అలాగే ప్రతి షూటింగ్ సెట్ లో ఐదుగురు వైద్యులు ఉన్నారని ఇటీవల ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ తెలిపింది.

ఇక ఎప్పుడూ సినిమాల కోసం రిస్క్ చేసే విక్రమ్.. ఇప్పుడు మరోసారి తంగలాన్ కోసం రిస్క్ తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 35 కేజీలు తగ్గినట్లు టాక్. అలాగే ఈ మూవీలో విక్రమ్ కు ఎలాంటి డైలాగ్స్ ఉండవని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు మరింత మించిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..