Mahesh Babu: ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. మ్యూజిక్ అదిరిపోయింది.. ఆ మూవీపై మహేష్ ప్రశంసలు..
హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. అలాగే తన లుక్ పూర్తిగా మార్చేశాడు. లాంగ్ హెయిర్.. ఫిట్నెస్తో అచ్చం హాలీవుడ్ హీరోల కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అలాగే కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని సెప్టెంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. అలాగే తన లుక్ పూర్తిగా మార్చేశాడు. లాంగ్ హెయిర్.. ఫిట్నెస్తో అచ్చం హాలీవుడ్ హీరోల కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అలాగే కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని సెప్టెంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమాపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు. రాయన్ సినిమాలో ధనుష్ యాక్టింగ్, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అలాగే ఎస్ జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ నటనతో మరోసారి మెప్పించారని.. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు వందశాతం కష్టపడ్డారని అన్నారు. ఇక మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని.. రాయన్ మూవీ కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని.. మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మహేష్ ట్వీట్ కు సందీప్ కిషన్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
రాయన్ సినిమాను తమిళ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కాశిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేశారు. మొదటి రోజే మంచి రివ్యూస్ అందుకున్న ఈసినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.
#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch…
Congratulations to the entire…
— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.