Actress Meena: మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించిన మీనా.. కారణమేంటంటే?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నాడు. న్యూజిలాండ్ లోని అందమైన లోకేషన్లలో ఈ క్రేజీ మూవీ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కన్నప్ప నుంచి ఇటీవలే విడుదలైన టీజర్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నాడు. న్యూజిలాండ్ లోని అందమైన లోకేషన్లలో ఈ క్రేజీ మూవీ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కన్నప్ప నుంచి ఇటీవలే విడుదలైన టీజర్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో థియేటర్లలోకి రానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే మంచు విష్ణు చేసిన ఓ పనిపై ప్రముఖ సీనియర్ నటి ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. వివరాలిలా ఉన్నాయి.. సినిమా నటీ నటులపై అసత్య వార్తలు ప్రచారం చేస్తూ, ట్రోలింగ్ కు పాల్పడుతోన్న యూట్యూబ్ ఛానల్స్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడి హోదాలో రద్దు చేయించాడు మంచు విష్ణు. నటీనటులకు సంబంధించిన వీడియోలను 48 గంటల్లో తొలగించాలని ఆ యూట్యూబ్ ఛానల్స్ కు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏకంగా 18 యూట్యూబ్ ఛానెల్స్ ను రద్దు చేయించాడు. విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ హీరోయిన్ మీనా ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
“తప్పుడు కంటెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై యాక్షన్ తీసుకున్న ‘మా’, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. నటీ, నటులు నెగెటీవ్ కామెంట్స్, ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని అందరం కలిసి ఎదుర్కొవాలి. సినిమా ఇండస్ట్రీ సమగ్రత కోసం మీరు చూపుతున్న అంకిత భావం చాలా గొప్పది, అభినందనీయం. ఇలాంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు భవిష్యత్ లో ఇంకా మరెన్నో తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు చాలా మంచి పనిచేశారు’ అంటూ విష్ణుపై ప్రశంసలు కురిపించింది మీనా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
నటి మీనా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఏవీఎం స్టూడియోలో మీనా.. వీడియో..
View this post on Instagram
అలనాటి హీరోయిన్లతో నటి మీనా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.