AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Mokshagna: అభిమన్యుడి పాత్రలో నందమూరి మోక్షజ్ఞ! ప్రశాంత్ వర్మ ప్లాన్ మాములుగా లేదుగా

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గతంలో వచ్చిన రూమర్లను నిజం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు నందమూరి బాలకృష్ణ. ఇక తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం.

Nandamuri Mokshagna: అభిమన్యుడి పాత్రలో నందమూరి మోక్షజ్ఞ! ప్రశాంత్ వర్మ ప్లాన్ మాములుగా లేదుగా
Prashanth Varma,Nandamuri Mokshagna
Basha Shek
|

Updated on: Jul 29, 2024 | 9:42 PM

Share

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గతంలో వచ్చిన రూమర్లను నిజం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు నందమూరి బాలకృష్ణ. ఇక తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక తాజాగా తన డెబ్యూ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు బాలయ్య కుమారుడు. ఇందులో తన సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు జూనియర్ నట సింహం. ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అంటూ మోక్షు చేసిన ట్వీట్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోక్షు- ప్రశాంత్ కాంబినేషన్ కు సంబంధించి కొన్ని క్రేజీ వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ తన సినిమాలో మోక్షజ్ఞను అభిమాన్యుడిగా చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞను కూడా ఒక సూపర్ హీరో తరహాలోనే తెలుగు ఆడియెన్స్ కు ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సినిమా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. అయితే అభిమన్యుడు అనగానే చాలామందికి నెగెటివ్ సెన్స్ వినిపిస్తుంది. చనిపోయే వీరుడి పాత్రలో మోక్షజ్ఞను చూపించడం ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అభిమన్యుడు చేసింది ఒక్కరోజు యుద్ధమైనా చరిత్రలో నిలిచిపోయాడు. పద్మవ్యూహంలోకి వెళ్లి వేలాది మంది సైనికులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడీ పాత్రకు మోక్షజ్ఞ బాగా సూట్ అవుతాడని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారంటీ. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి, మోక్షజ్ఞ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది.

నందమూరి మోక్షజ్ఞ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ