Theppa Samudram OTT: ఓటీటీలోకి బిగ్ బాస్ నటుడి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అర్జున్ అంబటి. ఏడో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అతను విజేతగా నిలవకపోయినా తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సీరియల్స్ తో బిజీగా ఉన్న అర్జున అంబటి అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు.

Theppa Samudram OTT: ఓటీటీలోకి బిగ్ బాస్ నటుడి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Theppa Samudram
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2024 | 3:21 PM

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అర్జున్ అంబటి. ఏడో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అతను విజేతగా నిలవకపోయినా తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సీరియల్స్ తో బిజీగా ఉన్న అర్జున అంబటి అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అలా అతను నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోల్ తెరకెక్కించిన ఈ సినిమాలో అర్జున్ అంబటితోపాటు చైతన్య రావు మరో కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన తెప్ప సముద్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే చిన్న సినిమా కావడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా ఆడలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన తెప్ప సముద్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అర్జున్ అంబటి సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 3 నుంచి తెప్ప సముద్రం సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఆహా. ‘డిగుండాల సముద్రంలో తెప్ప తీరం దాటేనా? తెప్ప సముద్రం మీ ఆహాలో వస్తుంది’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ పోస్టర్ ను కూడా అందులో షేర్ చేసింది.

నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించిన తెప్ప సముద్రం సినిమాలో ఆదర్శ్‌, కిషోరి ధాత్రక్, రవిశంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పెద్దపల్లి రోహిత్ స్వరాలు సమకూర్చారు. శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, సాయి బాబా తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని ‘తెప్ప సముద్రం’ అనే ఊరిలో స్కూల్ పిల్లలు మాయమవుతుంటారు. దీనికి కారణం కనుక్కోవడానికి ఎస్సై గణేశ్ (చైతన్య రావు) వస్తాడు. మరోవైపు రిపోర్టర్ ఇందు, ఈమె ప్రియుడు ఆటో డ్రైవర్ విజయ్ ( అర్జున్ అం బటి) కూడా పిల్లల కోసం వెతుకుంటారు. మరోవైపు గంజాయి దందాతో పిల్లల మిస్సింగ్‌కి సంబంధం ఉందని ఎస్సై తెలుకుంటాడు. మరి చివరకు ఏమైందనన్నదే తెప్ప సముద్రం సినిమా స్టోరీ.

ఇవి కూడా చదవండి

ఆహలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే