AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swathimuthyam: స్వాతిముత్యం సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..? అచ్చం హీరోలాగే..

దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. ఆయన సినీ ప్రయాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో స్వాతి ముత్యం ఒకటి. డైరెక్టర్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, నిర్మలమ్మ కీలకపాత్రలు పోషించారు.

Swathimuthyam: స్వాతిముత్యం సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..? అచ్చం హీరోలాగే..
Swathimuthyam
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2024 | 9:13 AM

Share

తెలుగు సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించినవారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు సినిమాల్లో బాలనటీనటులుగా అలరించిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇక మరికొందరు సినీ ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా తమ లైఫ్ సాఫీగా గడిపేస్తున్నారు. బాలనటులుగా ఉన్నప్పుడే అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆ చైల్డ్ ఆర్టిస్టుల యాక్టింగ్ గురించి ప్రేక్షకులు చర్చించుకుంటారు. తాజాగా ఇప్పుడు మరో బాలనటుడి గురించి మాట్లాడుకుందామా.. అతడే స్వాతిముత్యం చైల్డ్ ఆర్టిస్టు్. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న అద్భుతమైన నటులలో కమల్ హాసన్ ఒకరు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. ఆయన సినీ ప్రయాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో స్వాతి ముత్యం ఒకటి. డైరెక్టర్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, నిర్మలమ్మ కీలకపాత్రలు పోషించారు.

ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో స్వాతిముత్యం ఒకటి. ఇందులో కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ విశ్వనాథ్ ఒక క్యారెక్టర్ రాసుకుని.. ఆ పాత్ర చుట్టూ ఒక కథ అల్లుకుని.. అమాయకమైన వ్యక్తిగా కమల్ హాసన్ అయితే చేయగలడని అనుకుని ఏరికొరి మరీ ఎంపిక చేశాడట. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో రాధిక కొడుకు పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Karthik

Karthik

ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పోటీపడి మరీ నటించి అడియన్స్ మన్ననలు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు కార్తీక్. ఈ సినిమాలో రాధిక కొడుకుగా.. కమల్ హాసన్ కు స్నేహితుడిగా.. తనయుడిగా అద్భుతంగా నటించి చిన్నప్పుడే ప్రశంసలు అందుకున్నాడు. ఆ చిన్నోడు ఒకప్పుడు జానపద చిత్రాల హీరోగా ఓ వెలుగు వెలిగిన నటుడు కాంతారావుకి స్వయనా మనవడు. తన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒకరు ఉండాలనే ఉద్దేశంతో తన మనవడితో స్వాతి ముత్యం సినిమాలో నటించేలా చేశాడు. కానీ ఆ తర్వాత కార్తీక్ చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇండియాకు చెందిన రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్న కార్తీక్.. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తున్నాడు. అయితే కార్తీక్ కు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!