Raayan Twitter Review: రాయన్ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ మళ్లీ హిట్టు కొట్టాడా..?

ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నాడు. ధనుష్ రాసిన ఈ కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈరోజు (జూలై 26) థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.

Raayan Twitter Review: రాయన్ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ మళ్లీ హిట్టు కొట్టాడా..?
Rayaan Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2024 | 7:23 AM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా రాయన్. ముందు నుంచి ఈసినిమాపై దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ముఖ్యంగా ఈ హీరోకు హిందీ అడియన్స్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నాడు. ధనుష్ రాసిన ఈ కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈరోజు (జూలై 26) థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.

ఈరోజు రాయన్ సినిమా విడుదల సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తెల్లవారుజామున నుంచి ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే కనిపిస్తుంది. ధనుష్ సినిమా సీన్స్, పోస్టర్స్, ట్రైలర్ కట్స్ షేర్ చేస్తూ రాయన్ సినిమా గురించి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. రాయన్ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రాయన్ సినిమా గురించి ట్విట్టర్ ఖాతాలో చర్చలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

దర్శకుడిగా ధనుష్ మరోసారి సక్సెస్ అయ్యారని.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉందని.. టైటిల్ కార్డ్ సూపర్, ధనుష్ ఎంట్రీ మాస్ గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంక్ అదిరిపోయిందని, ధనుష్, సూర్యల నటన అద్భుతమని రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.