- Telugu News Photo Gallery Cinema photos Heroine Nabha Natesh New traditional photos goes attractive in social media on july 2024 Telugu Actress Photos
Nabha Natesh: అందానికి పట్టు చీరకడితే ఇదిగో.. ఇలా ఉంటుందేమో. నభా నటేష్ అందాల విందు..
నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు యూత్ లో నభా నటేష్ కు మరింత క్రేజ్ వచ్చేంది.
Updated on: Jul 26, 2024 | 8:00 AM

నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.

ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు యూత్ లో నభా నటేష్ కు మరింత క్రేజ్ వచ్చేంది.

అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

తనకు యాక్సిడెంట్ కావడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానని.. అదే సమయంలో కరోనా రావడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయినట్లు తెలిపింది.

చాలా కాలం గ్యాప్ అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుంది నభా. అలాగే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్వయంబు మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో తిరిగి జాయిన్ అయ్యింది.

ఈ మూవీతోపాటు.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలోనూ నభా నటిస్తున్నట్లు తెలుస్తోంది.




