- Telugu News Photo Gallery Cinema photos Actress Nora Fatehi who once lived in a house with 9 people survive on bread and egg now earns crores
ఒకప్పుడు తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు.. ఇప్పుడు 5 నిమిషాలకు కోట్లు అందుకుంటుంది
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. అవకాశాలు అందుకోవడం కోసం ఎంతో మంది సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెల్లగా స్థిరపడుతుంటారు.
Updated on: Jul 26, 2024 | 10:00 AM

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. అవకాశాలు అందుకోవడం కోసం ఎంతో మంది సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెల్లగా స్థిరపడుతుంటారు.

ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా చాలా కష్టాలను చూసి వచ్చింది. ఆమె ఓ విదేశీ యువతి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని రంగంలోకి దిగింది. రూ.5,000తో ఇండియా వచ్చింది. ఎన్నో కష్టాలు పడి అవకాశాలు అందుకుంది.

ఆమె బాలీవుడ్ యాక్ట్రస్ నటి నోరా ఫతేహి. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న అవకాశాలు దక్కించుకుంది నోరా. అప్పట్లో ఆమె ఓ రూమ్ లో ఉండేది.. ఆ రూమ్ లో ఆమెతో సహా తొమ్మిది మంది ఉండేవారట. అలాగే తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదట.

చిన్న చిన్న అవకాశాల నుంచి ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది. బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ తో పాపులర్ అయ్యింది నోరా. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా గడిపేస్తుంది. అలాగే కోట్లల్లో సంపాదిస్తుంది ఈ బ్యూటీ.

సినిమాల్లో కేవలం 5 నిమిషాలు నటించినా ఆమెకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ లభిస్తోంది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు నోరా పెట్టింది పేరు. తెలుగులోనూ చాలా సాంగ్స్ లో మెరిసింది ఈ బ్యూటీ. నోరా చాలా మంచి డ్యాన్సర్. అలాగే చాలా హార్డ్ వర్కర్ అవే ఈ అమ్మడిని స్టార్ గా నిలబెట్టాయి.




