Actress Rekha: తల్లిని కావాలనుకున్నాను.. నాకు చాలా మంది పిల్లలు కావాలి.. 69 ఏళ్ల వయసులో సీనియర్ హీరోయిన్ కామెంట్స్..

కాంచీపురం చీరలలో డిఫరెంట్ స్టైలీష్ లుక్స్ లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా రేఖకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 1984లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, కుటుంబం గురించి కొన్ని కామెంట్స్ చేసింది. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో రేఖ కూడా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది.

Actress Rekha: తల్లిని కావాలనుకున్నాను.. నాకు చాలా మంది పిల్లలు కావాలి.. 69 ఏళ్ల వయసులో సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
Rekha
Follow us

|

Updated on: Jul 26, 2024 | 6:51 AM

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానులను అలరించింది. రేఖ ఈరోజు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఈ హీరోయిన్ పేరు ఒకప్పుడు చాలా మంది ప్రముఖులతో వినిపించింది. కానీ సెలబ్రిటీతోనూ రేఖకు ఉన్న ఫ్రెండ్ షిప్, ప్రేమ పెళ్లి వరకు దారితీయలేదు. బీటౌన్ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని లవ్, బ్రేకప్ స్టోరీ రేఖ, అమితాబ్ బచ్చన్. వీరిద్దరి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ పార్టీలలో పాల్గొంటూ భారీగా పారితోషికం తీసుకుంటుంది రేఖ. కాంచీపురం చీరలలో డిఫరెంట్ స్టైలీష్ లుక్స్ లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా రేఖకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 1984లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, కుటుంబం గురించి కొన్ని కామెంట్స్ చేసింది. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో రేఖ కూడా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది.

‘నాకు చాలా మంది పిల్లలు కావాలి అనుకున్నాను. తల్లి కావాలనే నా కోరిక తీరుతుందని నమ్ముతున్నాను. కానీ పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. 30 ఏళ్లలోపు పిల్లలు పుట్టాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. అమ్మ చెప్పిన దాంట్లో నిజం ఉందని నాకు కూడా అనిపించింది… నా పిల్లలు నాతో పాటు ఎదగాలని భావించాను. నాకు, పిల్లలకు మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఎందుకంటే నేనెప్పుడూ 100 ఏళ్లు ముందుకే ఆలోచిస్తాను. నేను నా ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాను. కానీ ఇంట్లో ఒంటరితనాన్ని తగ్గించడానికి నాకు నా బిడ్డ కావాలి… నాకు ఇల్లు నిండుగా పిల్లలు కావాలి. అయితే పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. ఎందుకంటే నేను మా అమ్మను చూశాను. నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. ఒంటరి తల్లి మమ్మల్ని పెంచింది. అందుకే పిల్లలను ఒంటరిగా చూసుకోవడం అంత సులువు కాదని నాకు తెలుసు. నాకు బిడ్డ ఎప్పుడు పుడుతుందో నాకు తెలియదు.. బహుశా అది ఇంకెప్పటికీ జరగదు.’ అంటూ చాలా సంవత్సరాల క్రితం చెప్పుకొచ్చింది రేఖ. ఇప్పటికీ ఆమె తల్లి కాలేకపోయింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు రేఖ.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఎక్కువగా ప్రేమించింది. కానీ వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. అయితే వీరి దాంపత్యం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లయిన కొన్ని నెలలకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లయిన కొన్ని నెలలకే ముఖేష్ మరణం తర్వాత రేఖ విమర్శలను ఎదుర్కొంది. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!