AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R.Madhavan: కొత్త ఫ్లాట్ కొన్న హీరో మాధవన్.. రూ.17.5 కోట్లతో లగ్జరీ బంగ్లా.. ఎక్కడంటే..

ఇప్పటికే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టిన మాధవన్.. తాజాగా కొత్త ఇంటికి యజమాని అయ్యాడు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ముంబైలో మాధవన్ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త ఫ్లాట్ ధర దాదాపు రూ.17.5 కోట్లు ఉంటుందని టాక్. త్వరలోనే తన కొత్త ఇంటికి ఫ్యామిలీతో షిఫ్ట్ కానున్నారని అంటున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఆర్. మాధవన్ తనదైన ముద్ర వేశారు.

R.Madhavan: కొత్త ఫ్లాట్ కొన్న హీరో మాధవన్.. రూ.17.5 కోట్లతో లగ్జరీ బంగ్లా.. ఎక్కడంటే..
R.madhavan
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2024 | 6:34 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ హీరో మాధవన్.. ఇప్పుడు బాలీవుడ్‏లో బిజీగా ఉన్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం మాధవన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇప్పటికే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టిన మాధవన్.. తాజాగా కొత్త ఇంటికి యజమాని అయ్యాడు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ముంబైలో మాధవన్ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త ఫ్లాట్ ధర దాదాపు రూ.17.5 కోట్లు ఉంటుందని టాక్. త్వరలోనే తన కొత్త ఇంటికి ఫ్యామిలీతో షిఫ్ట్ కానున్నారని అంటున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఆర్. మాధవన్ తనదైన ముద్ర వేశారు.

ఈ ఏడాది మాధవన్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఆయన నటించిన ‘షైతాన్’ చిత్రం మార్చి 8న విడుదలైంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఆ చిత్రంలో ఆర్. మాధవన్ నెగిటివ్ పాత్రలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘షైతాన్’ సక్సెస్ తర్వాత మాధవన్ డిమాండ్ రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే తారలలో మాధవన్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో తీసుకున్న కొత్త ఇల్లు 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో రెండు విశాలమైన పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇది ఏ స్టార్ హోటల్‌లా విలాసవంతమైనది. మాధవన్ కొత్త ఇల్లు.

అజయ్ దేవగన్, జ్యోతిక, జానకి బోడివాలా జంటగా నటించిన చిత్రం ‘షైతాన్’. ఇందులో మాధవన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 149 కోట్ల రూపాయలను వసూలు చేసింది. హారర్ ప్రేమికులను అలరించిన ‘షైతాన్’ విజయంతో మాధవన్ కెరీర్ మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆయన చేతిలో 5కి పైగా సినిమాలున్నాయి. మాధవన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.