Prabhas: కర్ణుడికి ఏమాత్రం తీసిపోని బాహుబలి స్టోరీ.. ప్రభాస్ కథ చెబుతూ ఏడిపించేసిన బ్రహ్మానందం..
ప్రభాస్ ను కర్ణుడి పాత్రలో చూసిన అడియన్స్ సెకండ్ పార్టులోనూ కనిపిస్తాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కర్ణుడి కథకు ఏమాత్రం తీసిపోని బాహుబలి స్టోరీని బ్రహ్మానందం చెప్పిన మాటలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి. బాహుబలి సీన్లకు రంగమార్తండా సినిమాలో బ్రహ్మానందం చెప్పిన కర్ణుడి కథను లింక్ చేసిన సీన్స్ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు
కల్కి 2898 ఏడి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుతమైన విజువల్ వండర్ చూసి ఫిదా అవుతున్నారు అడియన్స్. ఇక ఇందులో మెయిన్ హైలెట్ కర్ణుడి పాత్ర. చివరి నిమిషంలో కర్ణుడి పాత్రలో ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. ఆలస్యమయ్యిందా ఆచార్యపుత్రా అంటూ కర్ణుడిగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ థియేటర్లు దద్ధరిల్లాయి. ప్రభాస్ ను కర్ణుడి పాత్రలో చూసిన అడియన్స్ సెకండ్ పార్టులోనూ కనిపిస్తాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కర్ణుడి కథకు ఏమాత్రం తీసిపోని బాహుబలి స్టోరీని బ్రహ్మానందం చెప్పిన మాటలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి. బాహుబలి సీన్లకు రంగమార్తండా సినిమాలో బ్రహ్మానందం చెప్పిన కర్ణుడి కథను లింక్ చేసిన సీన్స్ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కొక్కరి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇన్నాళ్లు కామెడీతో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం.. ఈ సినిమాలో తన నటవిశ్వరూపంతో ప్రేక్షకులను ఏడిపించేశారు. ఈ సినిమాలో ఆసుపత్రి సన్నివేశంలో ప్రకాష్ రాజ్ తో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్.. ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే హైలెట్ అయ్యాయి. కర్ణుడిగా బ్రహ్మానందం చెప్పిన డైలాగ్స్ నెట్టింట వైరలవుతుంటాయి. అయితే ఇప్పుడు అదే డైలాగ్ ను బాహుబలి సీన్లకు లింక్ చేశారు కొందరు. ప్రస్తుతం ఆ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
బాహుబలి సినిమాలోని ప్రభాస్ పాత్రను ఆధారంగా చేసుకుని కొన్ని సీన్లకు రంగమార్తండ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన “అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు.. కడుపు కోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసి వెళ్లింది.. ” డైలాగ్ లింక్ చేశారు. కర్ణుడి గురించి హాస్యబ్రహ్మా ఓ రేంజ్ లో చెప్పడం.. మరోవైపు ప్రభాస్ ఎలివేషన్లతో అదిరిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాటలు రావడం లేదంటూ.. కన్నీళ్లు తెప్పించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను ఓసారి మీరు చూసేయ్యండి.
Karna 💔 Bahubali
Rey em edit ra babu🥵🔥 ah elevations 💥 pic.twitter.com/7QudRHU9ZP
— Ashhu🖤 (@PrabhAshhu) July 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.