AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gharshana Movie: బాబోయ్.. వెంకీ ‘ఘర్షణ’ విలన్ ఇలా మారిపోయాడేంటీ..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు వెంకీ. ఇక ఇందులో రవి ప్రకాష్, డానియెల్ బాలాజీ, వంశీ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ అందించిన సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్.

Gharshana Movie: బాబోయ్.. వెంకీ 'ఘర్షణ' విలన్ ఇలా మారిపోయాడేంటీ..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Salim
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2024 | 12:00 PM

Share

వెండితెరపై అందమైన ప్రేమకథలను రూపొందించడంలో మణిరత్నంకు సాటిలేరు. తెలుగు అడియన్స్ హృదయాలలో నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత అదే స్థాయిలో అడియన్స్ మనసులను గెలుచుకున్న డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్. మిన్నాలే.. (తెలుగులో చెలి) సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్ తెలుగులో మొదటిగా తెరకెక్కించిన సినిమా ఘర్షణ. ఇందులో వెంకటేశ్, ఆసిన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు వెంకీ. ఇక ఇందులో రవి ప్రకాష్, డానియెల్ బాలాజీ, వంశీ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ అందించిన సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్.

ఇక ఈ సినిమాలో విలన్ పాండా పాత్రలో అదరగొట్టేశాడు నటుడు సలీమ్ బేగ్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ను ఢీకొట్టే పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమాతో పాండా పాత్రలో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. కానీ అంతలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. చాలా కాలంగా ఈ నటుడు సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఇప్పుడు సలీమ్ బేగ్ ఏం చేస్తున్నాడనే విషయాలు తెలియరాలేదు. అలాగే సోషల్ మీడియాలోనూ అతడు యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ చాలా కాలం క్రితం అతడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో అచ్చం హీరో కటౌట్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు పాండా.

జై మూవీతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన సలీమ్ బేగ్.. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కు పరిచయం చేశాడు. దీంతో అతడికి ఘర్షణ సినిమాలో విలన్ గా తీసుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో లెజెండ్, వినయ విధేయ రామ, గోలీమార్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సలీమ్ బేగ్ నటించిన ధ్రువ నక్షత్రం విడుదల కావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.