BIGG BOSS: బిగ్ బాస్‌ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్‌.? వారు ఏం చెప్పారో తెలుసా.!

BIGG BOSS: బిగ్ బాస్‌ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్‌.? వారు ఏం చెప్పారో తెలుసా.!

Anil kumar poka

|

Updated on: Aug 04, 2024 | 4:04 PM

బుల్లితెర ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. ఇందుకోసం అన్న పూర్ణ స్టూడియోస్ లో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. సీజన్ 8 లోగో కూడా రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఇక ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి పేర్లు కనిపిస్తున్నాయి.

బుల్లితెర ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. ఇందుకోసం అన్న పూర్ణ స్టూడియోస్ లో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. సీజన్ 8 లోగో కూడా రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఇక ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి పేర్లు కనిపిస్తున్నాయి. అందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ పేర్లు కాస్త గట్టిగా వినిపించాయి. అయితే ఈ టాక్‌ను కన్ఫర్మ్ చేసేలా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఈ ఇద్దరూ. !

‘బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ రాబోతోంది.. మీరు వెళ్లబోతున్నారా?’ అన్న ప్రశ్నకు.. చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది విష్ణు ప్రియ. తనకు స్వతహాగా బిగ్ బాస్ లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెబుతూనే, అయితే తనని బిగ్ బాస్ లో చూడాలి అని చాలా మంది అనుకుంటున్నారంది. అలాగే తనకు బిగ్ బాస్ కి వెళ్లాలి అని ఎందుకు ఉంది అన్న ప్రశ్నకు.. ఇటీవల పెరిగిన 10 కిలోల బరువు తగ్గించుకోవచ్చంటూ కామెంట్స్ చేశారంది. ఈ కామెంట్స్ అన్నీ చూస్తే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పిందీ యాంకరమ్మ. అలాగే అభిమానుల ఆశీస్సులు ఉంటే తప్పకుండా బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కచ్చితంగా కనిపిస్తానంటూ ఫైనల్ పంచ్ ఇచ్చింది విష్ణుప్రియ.

ఇక మరో జబర్దస్త్ నటి రీతూ చౌదరి కూడా విష్ణు ప్రియ కామెంట్స్ కాపీ పేస్ట్ అంటూ చెప్పింది. తద్వారా తనకి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉందంటూ చెప్పకనే చెప్పింది. ఇప్పటికే పలు టీవీ షోల్లో తెగ సందడి చేస్తున్నారు విష్ణు ప్రియ- రీతూ చౌదరి. మరి ఈ క్లోజ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే సందడి మాములుగా ఉండదంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.