- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi's Vishwambhara Movie Fame Ashika Ranganath Photos Goes Viral On Her Birthday
Tollywood:ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? ఫస్ట్ సినిమా ఫట్.. కానీ ఇప్పుడు చిరంజీవి మూవీలో ఛాన్స్
పై ఫొటోలో చారడేసి కళ్లతో మాయ చేస్తోన్న ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతేడాదే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న మొదటి సినిమానే దెబ్బేసింది. అయితే ఇప్పుడీ అమ్మడు దశ తిరిగింది.
Updated on: Aug 05, 2024 | 10:33 PM

పై ఫొటోలో చారడేసి కళ్లతో మాయ చేస్తోన్న ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతేడాదే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న మొదటి సినిమానే దెబ్బేసింది. అయితే ఇప్పుడీ అమ్మడు దశ తిరిగింది.

గత ఏడాది కల్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాత్. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ అషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత అక్కినేని అందగాడు నాగార్జునతో కలిసి ‘నా సామి రంగా’ చిత్రంలో నటించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షించింది ఆషికా

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఆషికా రంగనాథ్. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందీ అందాల తార.

ఇదిలా ఉంటే సోమవారం (ఆగస్టు 05) ఆషికా రంగనాథ్. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తోన్న ఆషికా.. అటు కన్నడం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.