AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: ఇదేం అభిమానం? గర్భగుడిలో హీరో దర్శన్ ఫొటోలకు పూజలు, మంగళ హారతి.. పూజారిపై సస్పెన్షన్ వేటు

అభిమాని చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో శాండల్‌వుడ్ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతను పరప్సన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అయితే జైలులో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా ఒక అర్చకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా గుడిలో హీరో దర్శన్ ఫొటోలు పెట్టి పూజలు నిర్వహించాడు

Darshan: ఇదేం అభిమానం? గర్భగుడిలో హీరో దర్శన్ ఫొటోలకు పూజలు, మంగళ హారతి.. పూజారిపై సస్పెన్షన్ వేటు
Drashan
Basha Shek
|

Updated on: Aug 06, 2024 | 6:46 PM

Share

అభిమాని చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో శాండల్‌వుడ్ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతను పరప్సన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అయితే జైలులో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా ఒక అర్చకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా గుడిలో హీరో దర్శన్ ఫొటోలు పెట్టి పూజలు నిర్వహించాడు. బళ్లారి జిల్లా కురుగోడిలోని బసవేశ్వర ఆలయంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా మల్లి అనే పూజారి బసవేశ్వర ఆలయంలో హీరో దర్శన్ చిత్ర పటాలు పెట్టి పూజలు, పునస్కారాలు నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ విషయం కాస్తా దేవాదాయ శాఖ వరకు వెళ్లడంతో సదరు పూజారిపై సస్పెన్షన్ వేటు వేసింది దేవాదాయ శాఖ. మల్లి అనే పూజారి దొడ్డబసవేశ్వరాలయంలో నటుడు దర్శన్ ఫొటోలకు పూజలు చేశారు. అంతేకాదు మంగళారతి కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన పూజారిని మత దేవాదాయ శాఖ సస్పెండ్ చేసింది.

అర్చక మల్లి ఆలయ సంప్రదాయానికి భంగం కలిగించడంతోపాటు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను అర్చక మల్లిని సస్పెండ్‌ చేస్తూ ధర్మాసన శాఖ మేనేజింగ్‌ అధికారి హనుమంతప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ ముగిసే వరకు ప్రజలు ఆలయాన్ని సందర్శించకుండా నిషేధం విధించారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. నిందితులకు ఆగస్టు 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.ఈ కేసులో ముగ్గురు సాక్షులను తుమకూరు జైలుకు తరలించారు. దర్శన్, ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మరోవైపు, దర్శన్ కుటుంబంతో పాటు అతని అభిమానులు దేవుడి వద్దకు వెళ్లారు. దర్శన్‌ని త్వరలో జైలు నుంచి విడుదల చేయాలని పూజలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దర్శన్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న అభిమాని.. వీడియో

 ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.