గుబురు గడ్డం, పెద్ద మీసం, తలనిండా జుట్టూ లేకపోతే ఇప్పుడు హీరోలు ట్రెండ్‌లో లేనట్టే. ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకున్నట్టున్నారు సాయిధరమ్‌తేజ్. గతంలో తనకు కలిసొచ్చిన విషయాన్నే మళ్లీ రిపీట్ చేయడానికి ఫిక్సయ్యారు. నయా సినిమా కోసం ఆయన మేకోవర్ అవుతున్న తీరు గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయిదుర్గాతేజ్ కెరీర్‌లో ది బెస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు తప్పక వినిపించే పాట ఇది.