Vinod Kambli:అయ్యో.. సచిన్ స్నేహితుడికి ఏమైంది? నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ.. కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో

టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ అత్యంత సన్నిహితుడు వినోద్ కాంబ్లీ గత కొన్నేళ్లుగ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చాలా సార్లు తన ఆరోగ్యం బాలేదని, ఆర్థిక సమస్యలతోరోజు రోజుకు తన పరిస్థితి దిగజారిపోతుందని, సాయం చేయాలని పలు సందర్భాల్లో వేడుకున్నాడీ మాజీ క్రికెటర్. తన కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటూ సోషల్ మీడియా ద్వారా క్రికెట్ పెద్దలను అభ్యర్థించాడు

Vinod Kambli:అయ్యో.. సచిన్ స్నేహితుడికి ఏమైంది? నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ.. కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
Vinod Kambli
Follow us

|

Updated on: Aug 05, 2024 | 9:49 PM

టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ అత్యంత సన్నిహితుడు వినోద్ కాంబ్లీ గత కొన్నేళ్లుగ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చాలా సార్లు తన ఆరోగ్యం బాలేదని, ఆర్థిక సమస్యలతోరోజు రోజుకు తన పరిస్థితి దిగజారిపోతుందని, సాయం చేయాలని పలు సందర్భాల్లో వేడుకున్నాడీ మాజీ క్రికెటర్. తన కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటూ సోషల్ మీడియా ద్వారా క్రికెట్ పెద్దలను అభ్యర్థించాడు. అయితే ఇప్పుడు వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. అతను నడవడానికే తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇతరులు చేయి అందిస్తే కానీ అడుగులు వేయలేకపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిలర్ వినోద్ కాంబ్లీకి చెంది వీడియోను షేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చాడు. “వినోద్ కాంబ్లీ గుండె సంబంధిత వ్యాధితో పాటుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. త్వరలోనే అతను కోలుకోవాలని, అవసరమైన సాయం అతడికి అందించాలని కోరుకుంటున్నాను” అంటూ కోరాడు. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. కాంబ్లీ త్వరగా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

సచిన్ టీమ్ మేట్‌, క్లోజ్ ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీ భారత జట్టు తరఫున చాలా మ్యాచ్ లు ఆడాడు. సొగసైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను అలరించాడు. కాంబ్లీ ఆటతీరును చూసి మరో సచిన్ అవుతాడనుకున్నారు. కానీ స్వయంకృతాపరాధంతో తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. టీమిండియా తరఫున 2000లో చివరి మ్యాచ్ ఆడిన కాంబ్లీ.. ఆతర్వాత ఆటకు శాశ్వతంగా దూరమయ్యాడు. అదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీనికి తోడు తాను చేసిన కొన్ని తప్పులకు ఆర్థికంగానూ చితికిపోయాడు. ప్రస్తుతం కాంబ్లీ దీనస్థితిలో ఉన్నాడని ఈ వీడియోను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మరి దీనిపై సచిన్ తో పాటు క్రికెట్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇతరుల సాయంతో అడుగులు వేస్తోన్న వినోద్ కాంబ్లీ.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!