Naga Chaitanya- Sobhita Dhulipala: అక్కినేని ఇంట పెళ్లిబాజాలు.. నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..

నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. కొద్ది నెలల కిందట ఫారిన్‌ వేకేషన్‌లో కలిసి కనిపించిన జంట అప్పట్నుంచే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా  చైతన్య, సమంత ప్రకటించారు. నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్‌ వచ్చాయ్‌.

Naga Chaitanya- Sobhita Dhulipala: అక్కినేని ఇంట పెళ్లిబాజాలు.. నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..
Naga Chaitanya Sobhita Dhul
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 08, 2024 | 8:16 AM

అక్కినేని ఇంట పెళ్లి  బాజాలు మోగనున్నాయి. ఇవాళ అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ జరగనుందని తెలుస్తోంది. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్‌మెంట్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. కొద్ది నెలల కిందట ఫారిన్‌ వేకేషన్‌లో కలిసి కనిపించిన జంట అప్పట్నుంచే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా  చైతన్య, సమంత ప్రకటించారు. నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్‌ వచ్చాయ్‌. శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్‌ చేస్తున్నట్టు న్యూస్‌ వైరల్‌ అయ్యింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్‌ పిక్స్‌ బయటికి కూడా వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ వార్తే కన్ఫ్మామ్‌ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో బయట పెట్టింది. చైతూతో ఓ చెఫ్ ఫొటో దిగారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్లిదరి పెళ్లి కన్ఫామ్ అనే అనుకున్నారు. ఇక ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విన్నర్‌ అయిన శోభిత ధూళిపాళ్ల. ఆ తర్వాత 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చిన శోభిత.. 2016లో తొలిసారి నటించింది. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో రామన్‌ రాఘవ్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. ఆ తర్వాత మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల. తెలుగులోనూ రెండు సూపర్‌ హిట్‌ మూవీస్‌లో నటించింది శోభిత ధూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢాచారి… 2022లో వచ్చిన మేజర్‌ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించింది.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.