AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas- Trisha: ప్రభాస్‌తో జతకట్టనున్న త్రిష.. 16 ఏళ్ల తర్వాత వెండితెరపై హిట్ పెయిర్.. ఏ మూవీలోనంటే?

ప్రభాస్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 'కల్కి 2898 AD' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలను అంగీకరిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. 'ది రాజా సాబ్' సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Prabhas- Trisha: ప్రభాస్‌తో జతకట్టనున్న త్రిష.. 16 ఏళ్ల తర్వాత వెండితెరపై హిట్ పెయిర్.. ఏ మూవీలోనంటే?
Prabhas, Trisha
Basha Shek
|

Updated on: Aug 06, 2024 | 10:44 PM

Share

యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో కొత్త సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. అయితే టీమ్ నుండి అధికారిక సమాచారం రాకముందే, స్పిరిట్ సినిమాపై కొన్ని పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. అందులో ఒకటి.. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తుందని అంటున్నారు. నటి త్రిష కృష్ణన్ గత 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమెకు ఇప్పటికీ హీరోయిన్ పాత్రలకు డిమాండ్ ఉంది. స్టార్ నటీనటులతోనూ ఈ సౌత్ క్వీన్ జోడీ కడుతోంది. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ త్రిషతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలను అంగీకరిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ‘ది రాజా సాబ్’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేతులు కలిపిన ‘స్పిరిట్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్‌’, ‘యానిమల్‌’ సినిమాల ద్వారా సందీప్‌ రెడ్డి వంగ తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన సినిమాల్లో మహిళల పాత్రను కించపరిచేలా చూపించారనే విమర్శలున్నాయి. యానిమల్’ విడుదలైనప్పుడు చాలా ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి త్రిష ఒప్పుకుంటుందా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక వెండితెరపై ప్రభాస్- త్రిషలది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరు వర్షం, బుజ్జిగాడు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించాయి. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో మళ్లీ ప్రభాస్- త్రిష జత కడితే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!