- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Poonam Kaur Wears Kerala Royal Clan On National Handloom Day
Tollywood: జాతీయ చేనేత దినోత్సవం.. కేరళ చీరలో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
బుధవారం (ఆగస్టు 07) జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు చేనేత వస్త్రాలు ధరించి వాటికున్న ఆవశ్యకత, ప్రాముఖ్యతను తెలియజేశారు. వారంలో కనీసం ఒకరోజైనా చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు. అలా జాతీయ చేనేత దినోత్సవం రోజున టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి కూడా కేరళ సంప్రదాయ చీరలో తళుక్కుమంది.
Updated on: Aug 07, 2024 | 10:31 PM

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో తెలుగుతో పాటు వివిధ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయినా తన సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు మాజీ సీఎం జగన్ పై పూనమ్ కౌర్ చేసిన పోస్టులు, కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి.

ఇదిలా ఉంటే బుధవారం (ఆగస్టు07) జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ చీరలో తళుక్కుమంది పూనమ్ కౌర్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు.

పూనమ్ గతంలో ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. చేనేత వస్త్రాలు, పరిశ్రమలకు తగిన గుర్తింపు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.

ఇప్పుడు చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలోనే భాగంగా కేరళ సంప్రదాయ చీర కట్టుకుని కనిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి




