- Telugu News Photo Gallery Cinema photos Actress samantha shocking remuneration for citadel honey bunny web series
Samantha: సినిమాలు చేయకున్నా సామ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు.. సిటాడెల్ కోసం ఎన్ని కోట్లు తీసుకుందంటే?
గతంలో కంటే సినిమాలు తగ్గించినా స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా సినిమా సినిమాకు ఆమె రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'సిటాడెల్: హనీ బానీ' వెబ్ సిరీస్‌లో నటించినందుకు సమంత ఎంత పారితోషికం తీసుకుందన్నది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Updated on: Aug 08, 2024 | 11:58 PM

గతంలో కంటే సినిమాలు తగ్గించినా స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా సినిమా సినిమాకు ఆమె రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'సిటాడెల్: హనీ బానీ' వెబ్ సిరీస్‌లో నటించినందుకు సమంత ఎంత పారితోషికం తీసుకుందన్నది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత తన సినిమాల ఎంపికలో చాలా చురుగ్గా ఉంటుంది. వ్యాధికి చికిత్స పొందుతున్న సమయంలో షూటింగ్‌లో పాల్గొనడం సవాలుతో కూడుకున్న పని. అందుకే రూ.కోట్లలో పారితోషకం తీసుకుంటోందీ అందాల తార.

ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సమంత రూత్ ప్రభు వెబ్ సిరీస్ లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. యాక్షన్ పాత్రల ద్వారా అభిమానులను అలరించింది.

రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో సమంత నటించింది. ఇప్పుడు అదే రాజ్-డీకే దర్శకత్వం వహించిన 'సిటాడెల్: హనీ బానీ' సిరీస్‌లో, సమంతా యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషించింది

నివేదికల ప్రకారం, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ కోసం సమంతా పారితోషికం సుమారు 10 కోట్లని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత తన కెరీర్‌లో ఒకే ప్రాజెక్ట్‌కి 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు.