AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Birthday Boy OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ థ్రిల్లింగ్ మూవీ.. ది బర్త్‌డే బాయ్‌ను ఎక్కడ చూడొచ్చంటే?

రిలీజ్ కు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించడం, టీజర్ ,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ది బర్త్ డే బాయ్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది

The Birthday Boy OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ థ్రిల్లింగ్ మూవీ.. ది బర్త్‌డే బాయ్‌ను ఎక్కడ చూడొచ్చంటే?
The Birthday Boy Movie
Basha Shek
|

Updated on: Aug 08, 2024 | 9:38 PM

Share

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల తదితరులతో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ది బర్త్‌డే బాయ్‌’. బొమ్మ బొరుసా బ్యానర్ పై ఐ.భరత్‌ నిర్మాణంలో విస్కీ దాసరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించడం, టీజర్ ,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ది బర్త్ డే బాయ్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే చిన్న సినిమా కావడంతో ఎక్కువ మంది జనాలకు రీచ్ కాలేకపోయింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయిన ది బర్త్ డే బాయ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ది బర్త్ డే బాయ్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 9 నుంచి ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఆహా. అలాగే సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

ది బర్త్ డే బాయ్ సినిమాలో ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్ సంగీతం అందించారు. న‌రేష్ ఆడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, సంకీర్త్ రాహుల్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 2016లో దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటననే కథగా మలిచి ది బర్త్ డే బాయ్ సినిమాను తెరకెక్కించారు. పుట్టినరోజు వేడుకల్లో ఓ స్నేహితుడు ఎలా చనిపోయాడు? ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అనేవి ఈ సినిమాలో కీలకాంశాలు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా.? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే ఆహాలో ది బర్త్ డే బాయ్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.