AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharateeyudu 2 OTT: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?

తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్లాఫ్ టాక్ రావడంతో చాలామంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వారి కోసమే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. భారతీయుడు 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ

Bharateeyudu 2 OTT: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?
Bharateeyudu 2 Movie
Basha Shek
|

Updated on: Aug 08, 2024 | 10:30 PM

Share

లోక నాయకుడు కమల్‌ హాసన్‌- సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భారతీయుడు 2’. దాదాపు 28 ఏళ్ల (1996)క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడుకు ఇది సీక్వెల్‌. అయితే ఆ మ్యాజిక్ ను కొనసాగించడంలో భారతీయుడు 2 ఘోరంగా విఫలమైంది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ తారాగణం, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఉన్నప్పటికీ ఔట్ డేటెస్ కథా, కథనాలు సినిమాకు మైనస్ గా మారాయని రివ్యూలు వచ్చేశాయి. తమిళంలో ఈ సినిమాకు ఒక మోస్తరు గానే వసూళ్లు వచ్చాయి. అయితే తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్లాఫ్ టాక్ రావడంతో చాలామంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వారి కోసమే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. భారతీయుడు 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 9 నుంచి కమల్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు కొన్ని రోజుల రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే భారతీయుడు 2 సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్నమాట. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

భారతీయుడు 2 సినిమాలో సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ సుమారు రూ. 250 కోట్లతో భారతీయుడు 2 సినిమాను నిర్మించారని సమాచారం. అయితే ఓవరాల్ గా ఈ సినిమా కేవలం రూ. 130 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భారతీయుడు 2 సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లలో నెగెటివ్ టాక్ రావడంతో ఒక వారం రోజులు ముందుగానే కమల్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. మరి థియేటర్లలో భారతీయుడు 2 సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కమల్ నటనను ఆస్వాదించండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి